42 Womens Murder : 42 మంది మహిళల్ని ముక్కలు చేసి.. డంపింగ్ యార్డులో పారేసిన క్రూరుడు

అతడొక సీరియల్ కిల్లర్. 2022 సంవత్సరం నుంచి 2024 జులై 11 మధ్యకాలంలో 42 మంది మహిళలను లొంగదీసుకొని ఆ క్రూరుడు పాశవికంగా హత్య చేశాడు.

  • Written By:
  • Updated On - July 21, 2024 / 11:31 AM IST

42 Womens Murder : అతడొక సీరియల్ కిల్లర్. 2022 సంవత్సరం నుంచి 2024 జులై 11 మధ్యకాలంలో 42 మంది మహిళలను లొంగదీసుకొని ఆ క్రూరుడు పాశవికంగా హత్య చేశాడు. కెన్యాకు చెందిన సీరియల్ కిల్లర్‌ 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవలే నైరోబీ నగర పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడు చేసిన వరుస హత్యల(Vampire Serial Killer) విషయం విని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నేరాన్ని అంగీకరించాడు. తానే 42 మంది మహిళలను మర్డర్(42 Womens Murder) చేశానని చెప్పాడు. మనిషి ప్రాణం అంటే అతడికి ఏమాత్రం విలువ లేదని..  కొల్లిన్స్‌ జమైసీని ఇంటరాగేట్ చేసిన పోలీసులు అధికారులు తెలిపారు. కొల్లిన్స్‌ జమైసీ తాను హత్యచేసిన మహిళల మృతదేహాలను ముక్కలు చేసి సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌లో పడేసేవాడని పోలీసులు పేర్కొన్నారు.  చంపిన మహిళల లిస్టులో అతడి భార్య కూడా ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

కెన్యాలోని నైరోబీ నగరంలో ఉన్న ముకురూ మురికివాడకు చెందిన 26 ఏళ్ల జోసఫ్‌ వైనో అనే మహిళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. దీనిపై జోసఫ్‌ వైనో సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా నగరంలోని ముకురూ మురికివాడ డంపింగ్ యార్డులో వెతకగా.. తొమ్మిది మంది మహిళల ఛిద్రమైన అవయవాలు బయటపడ్డాయి. అందులోనే జోసఫ్‌ వైనో డెడ్ బాడీ కూడా ఉంది. ఈ తొమ్మిది డెడ్‌బాడీస్‌కు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రెండు మృతదేహాలనే గుర్తించారు. మిగిలినవి తీవ్రంగా కుళ్లిపోయాయి. దీంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది.

Also Read :44228 Jobs : పోస్టాఫీసుల్లో 44,228 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల యువతకు గొప్ప ఛాన్స్

ఈ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే శిథిలమైన గదిలో నర హంతకుడు కొల్లిన్స్‌ జమైసీ అద్దెకు ఉండేవాడట. ఆ ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. భారీ ఎత్తున టేపు, నైలాన్‌ సంచులు, పరిశ్రమల్లో వాడే రబ్బర్‌ గ్లౌజులు, పెద్దసంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు లభించాయి. గదిలో మహిళలను గొంతుకోసి చంపిన అనంతరం.. వారి మృతదేహాలను పారవేసే క్రమంలో ఈ వస్తువులను అతడు వినియోగించేవాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ డెడ్‌బాడీస్‌ను పారవేసిన డంపింగ్ యార్డుకు సమీపంలోనే ఒక పోలీస్‌ స్టేషన్‌ కూడా ఉండటం గమనార్హం.

Follow us