Hezbollah Number 2 : లెబనాన్ రాజధాని బీరుట్‌పై శుక్రవారం రోజు ఇజ్రాయెల్ చేసిన మిస్సైళ్ల దాడిలో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ నంబర్ 2 స్థాయి కలిగిన నేత హతమయ్యాడు. ఆయన పేరు ఇబ్రహీం అఖీల్. అఖీల్‌తో పాటు మరో 12 మంది హిజ్బుల్లా కీలక నేతలు ఈ దాడిలో చనిపోయారు. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. అయితే ఇబ్రహీం అఖీల్ చనిపోయారనే విషయాన్ని హిజ్బుల్లా ఇంకా ధ్రువీకరించలేదు.
Also Read :US Voting : కమల వర్సెస్ ట్రంప్.. అమెరికాలో ‘ముందస్తు’ ఓట్ల పండుగ షురూ
ఇజ్రాయెల్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీలు పేలడంతో లెబనాన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. 32 మందికిపైగా చనిపోగా, 3200 మందికిపైగా గాయాలపాలయ్యారు. శుక్రవారం రోజు లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఒక భవనంపై ఇజ్రాయెల్ మిస్సైళ్లు ప్రయోగించింది. ఆ భవనంలోనే హిజ్బుల్లా నంబర్ 2 నేత అఖీల్ ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read :Raw Coconut Benefits: పచ్చి కొబ్బరి వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
ఇంతకీ ఎవరీ ఇబ్రహీం అఖీల్ అంటే.. హిజ్బుల్లాకు చెందిన ప్రత్యేక దళం ‘రద్వాన్’ కు(Hezbollah Number 2) ఆయనే సారథి. హిజ్బుల్లాకు చెందిన జిహాద్ కౌన్సిల్‌కు కూడా అఖీల్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం హిజ్బుల్లాలో హసన్ నస్రల్లా తర్వాతి ప్లేసులో అఖీలే ఉన్నారని చెబుతుంటారు. అఖీల్‌పై అమెరికా 1980వ దశకంలో ఆంక్షలు విధించింది. అప్పట్లో 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో కీలక పాత్ర ఇబ్రహీం అఖీల్‌దే అని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఆయన ఆచూకీ చెప్పేవారికి రూ.58 కోట్లు ఇస్తామని అమెరికా అనౌన్స్ చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దహియా ప్రాంతంలోనే ఈ ఏడాది జులైలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఝక్ర్‌ను ఇజ్రాయెల్ చంపింది. సరిగ్గా అదే ప్రాంతంలో ఇప్పుడు అఖీల్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ మట్టుబెట్టింది.