Sri Lanka PM : శ్రీలంకలో పాలక వర్గం పూర్తిగా మారిపోయింది. ఇటీవలే దేశ అధ్యక్షుడిగా మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే ఎన్నికవగా.. తాజాగా దేశ ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ఎంపికయ్యారు. ఇవాళ ఆమె లంక ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే గతంలో 1994 నుంచి 2000 సంవత్సరం మధ్యకాలంలో శ్రీలంక ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత శ్రీలంక ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా హరిణి(Sri Lanka PM) రికార్డును సొంతం చేసుకున్నారు.
Also Read :Tram Service : కోల్‌కతా ట్రామ్‌లు ఇక కనిపించవు.. దీదీ సర్కారు కీలక నిర్ణయం
- ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడిగా నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నేత అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు.
- ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్య కూడా నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నాయకురాలే.
- 54 ఏళ్ల వయసున్న హరిణికి నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీలో మంచి నేతగా పేరుంది.
- వాస్తవానికి హరిణి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. శ్రీలంకలో మానవ హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు.
- శ్రీలంక మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్రను క్రియేట్ చేశారు.
- దేశ ప్రధానిగా నియమితులైన హరిణి కీలకమైన న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
- ఇదే పార్టీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్ నిపుణ రచిచిలను శ్రీలంక క్యాబినెట్ మంత్రులుగా అవకాశాన్ని కల్పించారు.
- శ్రీలంకలో దిసనాయకేతో పాటు మొత్తం నలుగురితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది.
- ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని ఇప్పటికే దేశాధ్యక్షుడు దిసనాయకే ప్రకటించారు.
- ఈనేపథ్యంలో నవంబరు నెలలో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయి.