What Is Golden Dome : ఐరన్ డోమ్ గురించి మనం విన్నాం. ఇది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్‌ను మించిన రేంజులో గోల్డెన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇందుకోసం రూ.1500 కోట్లు (175 బిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తామని తెలిపారు. తొలివిడతగా రూ.213 కోట్లను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్‌ఫోర్స్‌కు చెందిన ఫోర్‌స్టార్ జనరల్ మైఖేల్ గుట్లిన్‌ను ట్రంప్ నియమించారు. మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టమ్స్‌లో నిపుణుడిగా మైఖేల్ గుట్లిన్‌కు పేరుంది.ఇంతకీ ఏమిటీ గోల్డెన్ డోమ్ ? ఏం చేస్తుంది ? తెలుసుకుందాం..
Also Read :Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు
గోల్డెన్ డోమ్ ఏం చేస్తుంది ?
- గోల్డెన్ డోమ్(What Is Golden Dome) గగనతల రక్షణ వ్యవస్థ అనేది బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి అమెరికాను రక్షిస్తుంది.
- గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచుతుంది.
- అమెరికా వైపుగా వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందే గుర్తించి.. అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా మార్గం మధ్యలోనే ధ్వంసం చేస్తుంది.
- గోల్డెన్ డోమ్ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల నెట్‌వర్కే చాలా కీలకమైంది.
- ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలో ఇంటర్‌సెప్టర్లతో ఓ నెట్‌వర్క్‌ను అమెరికా సృష్టించనుంది. అయితే లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత ఈజీకాదు.
- లేజర్లను అంతరిక్షంలోకి పంపేందుకు భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని రోదసీలోకి చేర్చాలి.
- గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక.. తమ దేశం వైపుగా వచ్చే మిస్సైళ్లను ధ్వంసం చేసేందుకు లేజర్ ఆయుధాలను కూడా అమెరికా వాడే ఛాన్స్ ఉంది.
- చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాల నుంచి పొంచి ఉన్న ముప్పును తట్టుకునేందుకే గోల్డెన్ డోమ్‌ను అమెరికా తయారు చేయిస్తోంది.
- గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల అంతరిక్షం కూడా యుద్ధ క్షేత్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.