Site icon HashtagU Telugu

Fire Accident: అమెరికా బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27మంది మృతి

Fire Accident

5080cd148c

Fire Accident: అమెరికాలోని ఓ గోల్డ్ మైన్ ప్రమాద ఘటనలో 27 మంది అమాయకులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి చేసే పెరూలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికి పోలీసులు ఈ ప్రమాదాన్ని దృవీకరించారు. వివరాలలోకి వెళితే..

పెరూకు దక్షిణంగా ఉన్న అరేక్విపా డిపార్ట్‌మెంట్‌లో ఉన్న యానాక్విహువా గనిలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అరేక్విపా స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గోల్డ్ మైనింగ్ సైట్‌కు దగ్గరగా ఉన్న చెక్క బ్లాకుల ద్వారా మంటలు త్వరగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు ఊపిరాడక మరణించారు. ఆ మరణాల్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

మొత్తం 27 మంది మైనర్లు మరణించారని స్థానిక ప్రాసిక్యూటర్ గియోవన్నీ మాటోస్ ఆదివారం స్థానిక మీడియాకు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే గనిలో పేలుళ్లు సంభవించాయని సమాచారం అందినప్పటికీ, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి అదనపు సమాచారం కంపెనీ అందించలేదు. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన పెరూలో రెండు దశాబ్దాలకు పైగా జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదం ఇది.

ఈ ఘటనపై పెరువియన్ ప్రభుత్వం మాట్లాడుతూ, అరెక్విపాలోని దక్షిణ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గనిని యాంక్విహువా అనే చిన్న-స్థాయి సంస్థ నిర్వహిస్తోంది. అయితే ఈ ఘటనపై కంపెనీ ఇంకా స్పందించలేదు. పెరూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బంగారు ఉత్పత్తిదారు మరియు రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు. పెరూ ఇంధనgold mine మరియు గనుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన 2000 నుండి జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదం. 2022లో దేశవ్యాప్తంగా మైనింగ్ ప్రమాదాల్లో 38 మంది చనిపోయారు.

Read More: Boat Tragedy Kerala : టూరిస్ట్ బోటు బోల్తా.. 18 మంది మృతి