Site icon HashtagU Telugu

Shocking Murder: బంగ్లాదేశ్‌లో యువతి దారుణ హత్య.. మొండెం నుంచి తలను వేరుచేసి..!

Indian Student Dies In US

Crime Imresizer

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన శ్రద్ధావాకర్ హత్య మాదిరిగానే బంగ్లాదేశ్‌లో కూడా ఒక హిందూ యువతిని ప్రేమికుడు చంపాడు. ప్రేమ పేరుతో ఆ యువతిని వంచించిన అబుబకర్ అనే నిందితుడు ఆమెను హత్యచేసిన అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి ప్లాస్టిక్ కవర్ చుట్టి సెపరేట్‌గా పెట్టాడు. మొండేన్ని మరొక బాక్స్‌లో పెట్టి అతని ఇంటి వద్దే ఉంచినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య లాంటి అనేక షాకింగ్ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఖుల్నాలో శ్రద్ధా వాకర్ లాంటి హత్య కేసు తాజాగా తెరపైకి వచ్చింది. అబూ బకర్ అనే వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు.

నిందితుడు తన హిందూ ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు అబూ బకర్ అని, హత్య చేయబడిన మహిళ పేరు కవితా రాణి అని అక్కడి కథనాలు చెబుతున్నాయి.
వారి ఇద్దరి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. గొడవలతో విసిగిపోయిన అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

కవిత, అబులకు సంబంధం ఉన్నట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. అబుకు పెళ్లయిందని కవితకు ఇంతకు ముందు తెలియదు. ఈ విషయాన్ని అబూ ఆ యువతికి ఎప్పుడూ చెప్పలేదు. అబు తనను మోసం చేశాడని ఆమెకు తెలియడంతో ఆమె నిరసనకు దిగింది. ఆ తర్వాత వారిద్దరూ రోజూ గొడవపడటం మొదలుపెట్టారు. దీంతో కవితను హతం చేయాలని అబు నిర్ణయించుకున్నాడు.

ముందుగా తలను నరికి, తర్వాత శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి సంచిలో ఉంచాడు. అనంతరం వాటిని డ్రెయిన్‌లో పడేశాడు. అబు పెళ్లి గురించి కవితకు తెలిసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీలో ఆమెను దారుణంగా హత్య చేసి నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లా మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేసి వివిధ ప్రాంతాల్లో పడేసిన విషయం తెలిసిందే.

 

 

 

Exit mobile version