Annoying Rooster: బాధ తట్టుకోలేక కోర్టును ఆశ్రయించిన దంపతులు.. అసలేం జరిగిందంటే?

టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా పల్లెటూర్ల లో ఇప్పటికి చాలామంది కోడికూతతో నిద్ర లేచి వారి పనుల్లో వారి

  • Written By:
  • Publish Date - August 22, 2022 / 08:15 AM IST

టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా పల్లెటూర్ల లో ఇప్పటికి చాలామంది కోడికూతతో నిద్ర లేచి వారి పనుల్లో వారి నిమగ్నం అవుతూ ఉంటారు. అయితే పొద్దు పొడవక ముందు నుంచి పొద్దు పొడిచే వరకు కోడి ఎన్నోసార్లు కూత వేస్తూ ఉంటుంది. అయితే జర్మనీలో ఒక జంట ఈ కోడి కూత వల్ల నరకం కనిపిస్తోంది అంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీలో ఒక వృద్ధ జంట ఒక కోడి తమకు నరకం చూపిస్తోంది అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. పక్కింటి కోడి రోజుకు 200 సార్లకు పైగా పెద్దగా కూతపెడుతోదని, ఆ కూతను భరించలేకపోతున్నాము దాన్ని ఎక్కడికైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టును ఆశ్రయించింది ఆ వృద్ధ జంట.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా జర్మనీలోని వోర్సెస్టర్ నగరానికి చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఐదేళ్ల కిందట పెంచుకునేందుకు కొన్ని కోళ్లను తెచ్చుకున్నారు. వాటిలో ఒక కోడి పుంజు కూడా ఉంది. అయితే ఆ పుంజు కోడి చాలా యాక్టివ్ గా ఉండడంతో దానికి మాగ్డా అని ముద్దుపేరు కూడా పెట్టారు. ఆ కోడి అన్నీ కోళ్ల మాదిరిగానే నిత్యం కొక్కరకో అంటూ కూత పెడుతుంది. ఆ ఇంటి పక్కనే ఉండే 76 ఏళ్ల ఫ్రెడరిక్ విల్ హెం, ఆయన భార్య జుట్టాలకు మాత్రం ఈ కోడి కూత భరించలేని విధంగా మారింది. దీనిపై వాళ్లు మైఖేల్ కు చెప్పినా ఆ కోడి పుంజు లేకుంటే, కోడిపెట్టలు నియంత్రణ తప్పుతాయని, కోడి పుంజును ఎక్కడికీ తరలించేది లేదని స్పష్టం చేశాడట.

ఇలా కొంతకాలం భరించిన ఫ్రెడరిక్, జుట్టా దంపతులు చివరికి కోర్టును ఆశ్రయించారట. ప్రతి రోజూ రాత్రి కోళ్లను గూట్లోకి పంపే మైఖేల్ మరునాడు పొద్దున 8 గంటలకు తన ఇంటి ఆవరణలోకి వదులుతాడు. అప్పటి నుంచి రాత్రిదాకా మాగ్డా కోడి పుంజు రెండు వందల సార్లు కూత పెడుతుందని ఫ్రెడరిక్ దంపతులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోడి పుంజు ఏ సమయంలో కూతపెడుతోందన్నది కొన్ని రోజుల పాటు రాసి పెట్టి మరీ దాన్ని కోర్టుకు ఇచ్చారు. ఈ కోళ్ల బాధ తట్టుకోలేక పొరుగిళ్లలో ఓ ఫ్యామిలీ ఖాళీ చేసి వెళ్లిపోయిందని వివరించారు. అంతేకాకుండా ఆ ఇంటి ఆవరణలో కూడా కూర్చోలేకపోవడమే కాకుండా,కనీసం కిటికీలు కూడా తీసి పెట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. ఆ కోడి ఎప్పుడు చూసినా కూడా బిగ్గరగా కూత పెడుతూనే ఉంటుందని,ఆ కోడిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని ఫ్రెడరిక్ కోర్ట్ ను కోరారు.