Site icon HashtagU Telugu

Gaza Deaths – Israel : ఆనాడు అమెరికాకు హిరోషిమా, నాగసాకి.. ఈనాడు మాకు గాజా : ఇజ్రాయెల్

Gaza Deaths Israel

Gaza Deaths Israel

Gaza Deaths – Israel : అణ్వాయుధాలను తయారు చేయొద్దని ప్రపంచ దేశాలకు ఆర్డర్స్ వేసే అమెరికా.. హిరోషిమాపై గతంలో తాను వేసిన అణుబాంబు కంటే  24 రెట్లు శక్తిమంతమైన అణు బాంబును తయారు చేసేందుకు రెడీ అయింది. దానికి ‘బీ61-13’ అని పేరు పెట్టే ఛాన్స్ ఉందట. ఈనేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై యుద్ధాన్ని ఆపాలంటూ తమకు సూచనలు చేస్తున్న అమెరికాను ఉద్దేశించి ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ తమపై చేసిన దాడికి ప్రతిఫలంగా.. భారీగా సామాన్య ప్రజల మరణాల రూపంలో   గాజా ప్రాంతం తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోందని పేర్కొంది. ఈవిషయాన్ని అమెరికా విదేశాంగ శాఖకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఆనాడు పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడికి స్పందించిన అమెరికా హిరోషిమా, నాగసాకిలపై రెండు అణు బాంబులను వేసింది. ఈనాడు మాపై హమాస్ దాడులకు ప్రతిగా మేం గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తాను గాజాపై చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్ధించుకుంది. దాడులను ఆపాలనే వ్యాఖ్యలను పదేపదే చేయొద్దని పరోక్షంగా అమెరికాకు సంకేతాలు పంపింది.  గాజాపై దాడి కోసం ఇజ్రాయెల్‌కు అమెరికా ఇప్పటిదాకా వందల కోట్ల ఆర్థిక సాయం, సైనిక సహాయం చేసింది. యెమన్, లెబనాన్, సిరియాలోని ఇరాన్ సపోర్ట్ కలిగిన మిలిటెంట్ సంస్థలు చేసే దాడులను అడ్డుకునేందుకు సైన్యాన్ని పంపింది. మరో 14.5 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ఇజ్రాయెల్‌కు అందించే ప్రయత్నాల్లో అమెరికా నిమగ్నమై ఉంది  ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది. వీరిలో దాదాపు సగం మంది పిల్లలే కావడం(Gaza Deaths – Israel) గమనార్హం.

Also Read: Vivek Venkataswamy : బీజేపీకి వివేక్ రాజీనామా..కాసేపట్లో రాహుల్ తో భేటీ