Site icon HashtagU Telugu

3 Hour Deadline : 3 గంటల్లోగా ఇళ్లు విడిచి వెళ్లిపోండి.. గాజన్లకు ఇజ్రాయెల్ వార్నింగ్

3 Hour Deadline

3 Hour Deadline

3 Hour Deadline : గాజాలోని ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. మూడు గంటల డెడ్ లైన్ ను విధించింది. ఆలోగా ఉత్తర గాజా ప్రాంతాన్ని వదిలేసి, దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈమేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస వెళ్లేందుకు ప్రత్యేక రూట్ ను కేటాయించామని.. ఆ రూట్ నుంచి వెళ్లే వారిపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎటువంటి ఆర్మీ ఆపరేషన్ నిర్వహించబోమని తేల్చి చెప్పింది. ఈ మూడు గంటల్లోగా వెళ్లిపోని వారు ఇజ్రాయెల్ ఆర్మీని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. ఉత్తర గాజా ప్రజల ప్రాణాలకు నష్టం  వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే .. దక్షిణ గాజాకు వెళ్లిపోవాలనే సూచన చేస్తున్నామని పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉత్తర గాజా ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలంటూ వ్యంగ్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ ట్వీట్ ను చేసింది. గాజా ప్రజలను ఊరు వదిలి వెళ్లమని ఇజ్రాయెల్ బాగానే జాలి చూపుతోందంటూ నెటిజన్స్ మండిపడ్డారు. కొంతమంది ఉగ్రమూకలు చేసిన దాడికి.. లక్షలాది మందిని బలి చేయడం సరికాదని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తర గాజాలోని ప్రజలను హమాస్ మానవ కవచంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే వారిని దక్షిణ గాజాకు వెళ్లిపోకుండా అడ్డుకుంటోందని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో మరో తొమ్మిది మంది ఇజ్రాయెలీ బందీలు గాజాలో చనిపోయారని హమాస్ ప్రకటించింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ప్రారంభిస్తే హమాస్ ఆట ముగిసినట్టేనని వెల్లడించింది. ఇక గాజాలోని ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా కార్యాలయాన్ని ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు మార్చారు. ఇజ్రాయెలీ సైన్యం హెచ్చరికతో ఐక్యరాజ్యసమితి ఈమేరకు మార్పులు (3 Hour Deadline)  చేసింది.

Also Read: World Cup 2023: బాబర్ అజాం కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని