Fuel Truck Explosion: కరీబియన్ దేశం హైతీలో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హైతీలోని మిరాగోయెన్ నగరంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌కు లీకేజీ జరిగింది. లీకేజీ ద్వారా వస్తున్న ఆయిల్‌ను పట్టుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ట్యాంకర్ వద్ద గుమిగూడారు. వారంతా పోటీపడి మరీ ఆయిల్‌ను బాటిళ్లు, పాత్రలలో పట్టుకున్నారు. ఈక్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ట్యాంక్ చుట్టూ గుమిగూడి నిలబడిన ప్రజల్లో 25 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్సను అందించారు.
Also Read :President Attacked : కొమొరోస్ దేశాధ్యక్షుడిపై సైనికుడి హత్యాయత్నం.. అసలేం జరిగింది ?
చనిపోయిన 25 మందిలో 16 డెడ్‌బాడీస్(Fuel Truck Explosion) గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. సంఘటనా స్థలాన్ని హైతీ ప్రధానమంత్రి గ్యారీ కోనైల్ సందర్శించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని హెలికాప్టర్ ద్వారా పెద్ద ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హైతీ ప్రధానమంత్రి ప్రకటించారు.
Also Read :Kids Height Increase : మీ పిల్లల ఎత్తును పెంచడానికి కొన్ని సహజ మార్గాలు ..!
హైతీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి రోడ్లపై కొన్ని గ్యాంగులు పెత్తనం చలాయిస్తున్నాయి. ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బును లూటీ చేస్తున్నాయి. హైతీ దేశంలో ప్రధానంగా ఆకలి కేకలు ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. పేదరికం, అసమానతలు ఆ దేశాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిత్యం ఎంతోమంది హైతీ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. మిలిటెంట్ గ్రూపుల ఆగడాలతో ఈ దేశంలో వ్యాపార సంస్థలు కార్యకలాపాలు సాగించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఉపాధి అవకాశాలు కరువయ్యాయి.