US Presidents Vs Attacks : లింకన్‌ నుంచి ట్రంప్‌ దాకా అమెరికా ప్రెసిడెంట్లపై దాడుల ప్రస్థానం

డొనాల్డ్‌ ట్రంప్‌పై  జరిగిన హత్యాయత్నంతో అమెరికాలో కలకలం రేగింది. 

Published By: HashtagU Telugu Desk
Trump Shooting Case

Trump Shooting Case

US Presidents Vs Attacks : డొనాల్డ్‌ ట్రంప్‌పై  జరిగిన హత్యాయత్నంతో అమెరికాలో కలకలం రేగింది.  మాజీ అధ్యక్షుడిపై దాడి జరగడాన్ని యావత్ అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌‌కు(Donald Trump) ఈ హత్యాయత్నం ఘటనతో విజయావకాశాలు పెరిగాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ దేశ అధ్యక్ష అభ్యర్థులపై దాడి జరగడం అమెరికాలో కొత్త విషయమేం కాదు. గతంలోనూ ఆ దేశ అధ్యక్ష అభ్యర్థులపై దాడులు(US Presidents Vs Attacks) జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

  • అబ్రహం లింకన్‌ మహా మేధావి. అమెరికాలో సామాన్యుడి స్థాయి నుంచి అధ్యక్ష హోదా దాకా చేరిన రాజకీయ దిగ్గజం.  ఆయన రాజకీయ హింసకు 1865 ఏప్రిల్‌ 14న బలయ్యారు.  జాన్‌ విల్కెస్‌ బూత్‌ అనే దుండగుడు జరిగిన కాల్పుల్లో లింకన్ ప్రాణాలు కోల్పోయారు. నల్లజాతీయుల హక్కుల కోసం మాట్లాడుతున్నందు వల్లే  ఆయన మర్డర్‌కు గురయ్యారు.
  • గార్ఫీల్డ్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే ఆయన మర్డర్‌కు గురయ్యారు. 1881 జులై 2న ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వాషింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నటైంలో చార్లెస్‌ గిటౌ అనే దుండగుడు తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు అనేక వారాల పాటు వైట్‌హౌస్‌లో చికిత్స జరిగింది. చివరకు అదే ఏడాది సెప్టెంబరులో తుదిశ్వాస విడిచారు.

Also Read :Ratna Bhandagar : తెరుచుకున్న జగన్నాథుడి ‘రత్న భాండాగారం’.. ఖజానా లెక్కింపు షురూ

  • మెక్‌కిన్లే అమెరికా మాజీ అధ్యక్షుడు.. ఈయన సామాన్యులతో కలవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. 1901వ సంవత్సరం  సెప్టెంబర్‌ 6న ఆయన సామాన్య ప్రజలతో కలిసి మాట్లాడుతుండగా కాల్పులు జరిగాయి. రెండు బుల్లెట్లు మెక్‌కిన్లే ఛాతీలోకి వెళ్లాయి. దీంతో వారంపాటు చికిత్సపొందిన అనంతరం ఆయన ప్రాణాలు వదిలారు.  రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. ఆరు నెలల్లోనే మెక్ కిన్లే మర్డర్ జరిగింది.
  • జాన్‌ ఎఫ్‌ కెన్నడీ  అమెరికా మాజీ అధ్యక్షుడు.. ఆయన వాహన కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 1963 సంవత్సరం నవంబరు నెలలో ఈ ఘటన జరిగింది. డల్లాస్‌ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కెన్నడీని పార్క్‌ల్యాండ్‌ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ చనిపోయారు.

Also Read :Head Constable Posts : 112 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ.81వేల దాకా శాలరీ

  Last Updated: 14 Jul 2024, 04:02 PM IST