Site icon HashtagU Telugu

Germany Elections: జర్మనీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం.. క్రైస్తవ పార్టీల విజయ దుందుభి

Friedrich Merz German Chancellor Germany Elections 2025

Germany Elections: జర్మనీ జాతీయ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ) రెండో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. ఈ ఎన్నికల్లో క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ)తో కలిసి పోటీ చేసిన సీడీయూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ ‘బుండెస్టాగ్‌’లో మొత్తం 630 స్థానాలు ఉన్నాయి. వీటిలో 208 సీట్లను 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్‌ సారథ్యంలోని సీఎస్‌యూ, సీడీయూ పార్టీల కూటమి సాధించింది. అలైస్ వీడెల్ సారథ్యంలోని ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) పార్టీ 152 సీట్లను గెల్చుకుంది.  దీంతో ప్రస్తుత జర్మనీ ఛాన్స్‌లర్ ఓలఫ్ షోల్జ్‌ సారథ్యంలోని  అధికార కూటమికి ఓటమి ఖాయమైంది. ఓలఫ్ షోల్జ్‌కు చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(SDP)కి 120 సీట్లే వచ్చాయి.

Also Read :Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు

ఏప్రిల్ 20న ప్రమాణం

ఫ్రెడరిక్ మెర్జ్‌ను జర్మనీ(Germany Elections) ఛాన్స్‌లర్‌ పీఠం వరించబోతోంది.  ఆయన ఏప్రిల్ 20న ఈస్టర్ పండుగ వేళ ఛాన్స్‌లర్‌‌గా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అమెరికా, రష్యాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా ఐరోపా ఖండాన్ని ఏకం చేస్తానని మెర్జ్ ప్రకటించారు. ఇటీవలే జర్మనీ ఎన్నికల్లో ఎలాన్ మస్క్ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. జర్మనీ రాజకీయ పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD)కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మద్దతు తెలపడాన్ని ఖండించారు.

Also Read :Lizard Venom VS Diabetes : షుగర్ ఔషధాలకు విషపూరిత బల్లులతో లింక్.. ఏమిటి ?

ఫ్రెడరిక్ మెర్జ్‌ కెరీర్ గ్రాఫ్