Viral : ఫ్రాన్స్ అధ్యక్షుడిని చెంప దెబ్బ కొట్టిన భార్య..?

Viral : విమానానికి దిగేటప్పుడు మాక్రన్ తన భార్య చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, బ్రిగెట్టే మాత్రం స్పందించకపోవడం నెటిజన్లలో అనేక అనుమానాలకు దారి తీసింది

Published By: HashtagU Telugu Desk
French President Emmanuel M

French President Emmanuel M

ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ (Emmanuel Macron) మరియు ఆయన భార్య బ్రిగెట్టే మాక్రన్‌ (Brigitte)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ వీడియోలో బ్రిగెట్టే మాక్రన్ తన భర్త చెంపపై కొట్టినట్టు కనిపించడం పెద్ద వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. వివాదాస్పదంగా మారిన ఈ వీడియోను లక్షలాది మంది నెటిజన్లు వీక్షిస్తున్నారు.

ఈ సంఘటన మాక్రన్ దంపతుల ఆగ్నేయాసియా పర్యటన సమయంలో చోటుచేసుకుంది. వారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. మాక్రన్ ప్రత్యేక విమానం హనోయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం తలుపు తెరుచుకునే సమయంలో బ్రిగెట్టే తన భర్త చెంపపై కొట్టినట్టు వీడియోలో కనిపించింది. ఆ దెబ్బకు మాక్రన్ కొద్దిసేపు ఆగిపోవడం గమనించదగిన అంశం. అయినప్పటికీ ఆయన నవ్వుతూ బయటకు రావడం, ఆ తర్వాత బ్రిగెట్టే కూడా బయటకు రావడం వీడియోలో ఉంది.

Heavy Rain : ముంబై వర్షాలు.. 107 ఏళ్ల రికార్డ్ బ్రేక్

విమానానికి దిగేటప్పుడు మాక్రన్ తన భార్య చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, బ్రిగెట్టే మాత్రం స్పందించకపోవడం నెటిజన్లలో అనేక అనుమానాలకు దారి తీసింది. ఆమె ముఖంలో కొంత ఆగ్రహం కనిపించిందని కొందరు పేర్కొంటున్నారు. దీనిని బట్టి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనేది నెటిజన్ల అభిప్రాయం. అయితే మాక్రన్ మాత్రం తన ముఖంలో ఎలాంటి భావావేశాలను వ్యక్తపరచకుండా సాదాసీదాగా ఉండడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీరి వ్యక్తిగత జీవితంపై ఆసక్తిగా గమనిస్తున్న నెటిజన్లు ఈ వీడియో ఫై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

  Last Updated: 26 May 2025, 09:46 PM IST