Naked Art Exhibition : ఫ్రాన్స్ దేశంలోని మార్సెయిల్ నగరంలో ఉన్న ‘మార్సెయిల్ మ్యూజియం ఆఫ్ యూరోపియన్ అండ్ మెడిటరేనియన్ సివిలైజేషన్స్’ ఈసారి వెరీవెరీ స్పెషల్‌గా నిలువబోతోంది. ఇటీవలే ఆ మ్యూజియంలో మొదలైన ఆర్ట్ ఎగ్జిబిషన్ డిసెంబరు 9వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే స్పెషాలిటీ ఏమిటన్నది తెలియాలంటే ఈ కథనాన్ని చివరి వరకు చదవండి..
Also Read :Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ
ఈసారి నిర్వహిస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్(Naked Art Exhibition) గురించి తెలియాలంటే తొలుత మనం ప్రకృతివాదం (నేచరిజం) గురించి తెలుసుకోవాలి. మనిషి నేచురల్‌గా ఆది మానవుడిలా నగ్నంగా ఉండాలని నేచరిజం చెబుతోంది. యూరోపియన్ దేశాలు టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్‌గా ఉన్నా.. అక్కడి చాలామంది ప్రజలు నేటికీ నేచరిజం లాంటి అనాగరిక చేష్టలను నమ్ముతారు. స్త్రీ, పురుషులు బహిరంగంగా నగ్నంగా తిరగొచ్చు అనేది నేచరిజం వాదన. ఈ వాదనను నమ్మే వాళ్లు ఫ్రాన్స్ సహా చాలా ఐరోపా దేశాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు.
Also Read :Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు
‘మార్సెయిల్ మ్యూజియం ఆఫ్ యూరోపియన్ అండ్ మెడిటరేనియన్ సివిలైజేషన్స్’లో ఇప్పుడు జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పూర్తిగా నగ్నంగా ఉండే ఆర్ట్‌లను ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఈ ఆర్ట్‌కు వచ్చే వాళ్లంతా నేచరిజంను నమ్మేవాళ్లు. ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చే వాళ్లంతా తొలుత దుస్తులను విప్పేయాలి. ఆ తర్వాతే లోపలికి ఎంటర్ కావాలి. నగ్నంగా తిరుగుతూ లోపల డిస్‌ప్లే చేసిన ఆర్ట్‌లను చూడాలి. నగ్నత్వాన్ని ప్రోత్సహించే, దాని గురించి గొప్పగా చెప్పే దాదాపు 600 ఆర్ట్‌లను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. దీనికి వచ్చేందుకు ఇప్పటికే చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జులై నెల నుంచే ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. నేచరిజంను నమ్మే వాళ్ల కోసం.. ఈ మ్యూజియంలో ఇప్పటికే ఐదుసార్లు స్పెషల్ సెషన్లను కండక్ట్ చేశారు. ఆ సెషన్లకు దాదాపు 600 మంది హాజరయ్యారు.