Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..

జిమ్మీ కార్టర్‌కు ఇదే తొలి గ్రామీ అవార్డు కాదు. ఆయన బతికి ఉండగా మూడు గ్రామీ అవార్డులను(Jimmy Carter) గెల్చుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Former Us President Jimmy Carter Grammy Award Best Audiobook Last Sundays In Plains A Centennial Celebration

Jimmy Carter : జిమ్మీ కార్టర్.. దివంగత అమెరికా అధ్యక్షుడు. ఈయనను కూడా ఈసారి (2025) గ్రామీ అవార్డు వరించింది.  జిమ్మీ కార్టర్‌‌కు చెందిన “ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్” అనే ఆడియో పుస్తకం గ్రామీ అవార్డుల్లో బెస్ట్ ఆడియో బుక్‌గా ఎంపికైంది. 2024 సంవత్సరం డిసెంబరు 30న వందేళ్ల వయసులో జిమ్మీ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన దాదాపు నెల రోజుల తర్వాత గ్రామీ పురస్కారాన్ని ప్రకటించడం గమనార్హం. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమెరికాలోని లాస్ ఎంజెల్స్ వేదికగా  నిర్వహించారు. జిమ్మీ కార్టర్ తరఫున ఆయన మనుమడు జేసన్ కార్టర్ గ్రామీ అవార్డును అందుకున్నారు. చనిపోవడానికి ముందే  జిమ్మీ కార్టర్‌కు గ్రామీ అవార్డు లభించి ఉంటే, అతిపెద్ద వయసులో గ్రామీ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సాధించి ఉండేవారు. 2011లో 97 ఏళ్ల వయసున్న పినెటాప్ పెర్కిన్స్ గ్రామీ అవార్డును అందుకున్నారు. అత్యధిక వయసులో గ్రామీ అవార్డు అందుకున్న రికార్డు ఇప్పటికే ఆయన పేరిటే ఉంది.

Also Read :Gun Firing Case : బత్తుల ప్రభాకర్ టార్గెట్.. రూ.333 కోట్లు, 100 మంది యువతులు..

జిమ్మీకి ఇప్పటికే మూడు గ్రామీలు..

జిమ్మీ కార్టర్‌కు ఇదే తొలి గ్రామీ అవార్డు కాదు. ఆయన బతికి ఉండగా మూడు గ్రామీ అవార్డులను(Jimmy Carter) గెల్చుకున్నారు. మొత్తం మీద జిమ్మీ కార్టర్ ఖాతాలో చేరిన గ్రామీ అవార్డుల సంఖ్య నాలుగుకు చేరింది. జిమ్మీకి గ్రామీ అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

నోబెల్ సైతం..

ప్రపంచ శాంతికి కృషి చేసినందుకు 2022లో జిమ్మీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. జిమ్మీ కార్టర్ 199 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 1979వ సంవత్సరంలో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య ఆయన శాంతి ఒప్పందం కుదిర్చారు.

ఒబామా, క్లింటన్ సైతం.. 

గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌‌లకు కూడా గ్రామీ అవార్డులు వచ్చాయి. అలాగే అమెరికా అధ్యక్షుల భార్య మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లకు కూడా ఈ ఆవార్డులు దక్కాయి. మాజీ అధ్యక్షులు హ్యారీ ఎస్ ట్రూమాన్, జాన్ ఎఫ్ కెన్నెడీ, రిచర్డ్ నిక్సన్‌లు ఈ అవార్డు కోసం నామినేట్ అయినా పురస్కారం దక్కలేదు.

Also Read :Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేయమని..

ఇంద్రానూయి సోదరికి సైతం గ్రామీ..

ఇండో-అమెరికన్ సంగీత విద్వాంసురాలు, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. వౌటర్ కెల్లర్‌ మాన్, ఎరు మాట్సుమోటోతో కలిసి ఈ అవార్డును ఆమె గెలుచుకున్నారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సోదరే చంద్రికా టాండన్. చెన్నైకు చెందిన వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. బెస్ట్ న్యూ ఏజ్, యాంబియంట్, చాంట్ ఆల్బమ్ విభాగంలో ‘త్రివేణి’ ఆల్బమ్‌‌కు గ్రామీ అవార్డు వచ్చింది. మొత్తం  ఏడు ట్రాక్‌లు ఉన్న త్రివేణి అల్బమ్ 2024 ఆగస్టు 30న విడుదలైంది.

ఇతర గ్రామీలు వీరికే..

  • ఉత్తమ నూతన కళాకారుడు – చాపెల్ రోన్
  • ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ – సబ్రినా కార్పెంటర్ (షార్ట్ ఎన్ స్వీట్)
  • ఉత్తమ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ – సబ్రినా కార్పెంటర్ (ఎస్ప్రెస్సో)
  • బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ రికార్డింగ్ – టేమ్ ఇంపాలా
  • బెస్ట్ ర్యాప్ ఆల్బమ్- డోచీ (అలిగేటర్ బైట్స్ నెవర్ హీల్)
  Last Updated: 03 Feb 2025, 01:28 PM IST