Bill Clinton Hospitalised : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత.. ఆయనకు ఏమైందంటే..?

క్లింటన్(Bill Clinton Hospitalised) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Bill Clinton Hospitalised Us Washington

Bill Clinton Hospitalised : అమెరికా మాజీ అధ్యక్షుడు 78 ఏళ్ల  బిల్‌ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. క్లింటన్(Bill Clinton Hospitalised) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈవివరాలను క్లింటన్‌ వ్యక్తిగత సిబ్బంది మీడియాకు తెలిపారు. క్రిస్మస్ నాటికి  ఆయన ఇంటికి తిరిగొస్తారని చెప్పారు.

Also Read :Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్‌ హనియా‌ను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్

  • 1993 నుంచి 2001 మధ్యకాలంలో బిల్‌క్లింటన్  రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
  • అధ్యక్ష పదవీకాలం పూర్తయిన తర్వాత క్లింటన్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
  • 2004లో ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి వచ్చింది. శ్వాసకోస సమస్యలు ముసురుకున్నాయి. ఈక్రమంలో  ఆయనకు వైద్యులు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీలు చేయాల్సి వచ్చింది.
  • ఇవన్నీ జరిగిన ఏడాది తర్వాత క్లింటన్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీంతో ఇంకోసారి ఆస్పత్రిలో చేరారు.
  • 2010 సంవత్సరంలో క్లింటన్‌కు గుండె సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో ఆయన గుండెెకు మరోసారి సర్జరీ చేసి, రెండు స్టంట్లు వేశారు. దీంతో క్లింటన్ కోలుకున్నారు.
  • ఇక 2021లో క్లింటన్‌కు మూత్రనాళ  ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఆరోగ్య సమస్యలన్నీ ఉన్నా.. ఆయన వెనక్కి తగ్గలేదు.
  • ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ తరఫున  ప్రచారం చేశారు.

Also Read :Bank Holiday: బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ అల‌ర్ట్.. ఐదు రోజుల‌పాటు బ్యాంకులు బంద్‌!

  Last Updated: 24 Dec 2024, 09:16 AM IST