Site icon HashtagU Telugu

Football Match Clashes : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రక్తసిక్తం.. రెఫరీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఘర్షణ.. 100 మంది మృతి

Guinea Football Match Clashes

Football Match Clashes : ఆఫ్రికా దేశం గినియాలో ఘోరం జరిగింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె‌లో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌  రక్తసిక్తమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 100 మందికిపైగా చనిపోయారు.

Also Read :Telangana: తెలంగాణ‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. 400 మందికి ఉద్యోగాలు?

గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్‌ సందర్భంగా రెఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా చూస్తుండగానే తీవ్రస్థాయి ఘర్షణగా మారింది. తొలుత రెఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీమ్ అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. ఈక్రమంలో మరో జట్టు అభిమానులు కూడా అక్కడికొచ్చి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు వర్గాలు ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి మొదలుకొని, దాని చుట్టూ ఉండే వీధుల దాకా విస్తరించి మరీ కొట్టుకున్నారు. కొందరు నేరుగా వెళ్లి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో చనిపోయిన ఎంతోమంది  డెడ్‌బాడీస్ స్టేడియంలో, చుట్టుపక్కనున్న వీధుల్లో పడి ఉన్న ఫొటోలు(Football Match Clashes) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read :Ghantasala : ఘంటసాల బయోపిక్.. ఘంటసాలగా నటించేది ఎవరంటే.. రిలీజ్ ఎప్పుడంటే..?

గినియా సైనిక నియంత ఏం చేయబోతున్నాడు ?

గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ విషయానికి వస్తే.. ఆయన ఒక సైనిక అధికారి. 2021 సంవత్సరంలో సైనిక తిరుగుబాటు ద్వారా గినియాలోని అధ్యక్షుడు ఆల్ఫా కోండే  ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన అధికారంలోకి వచ్చారు.  తనను తాను గినియా అధ్యక్షుడిగా మమాడి దౌంబోయ ప్రకటించుకున్నారు. 2025 సంవత్సరంలో గినియాలో అధ్యక్ష ఎన్నికలను నిర్వహించి.. తాను పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. 2024 సంవత్సరం చివరికల్లా దేశంలో ప్రజా పాలనను పునరుద్ధరిస్తానని మమాడి దౌంబోయ చెబుతున్నారు. గినియాలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయినా నేటికీ పేదరికంలోనే మగ్గుతోంది. దీనికి కారణం అక్కడి పాలకుల పెత్తందారీతనం. మాలీ, బుర్కినా ఫాసో, నైజర్ దేశాల్లో ఈవిధమైన సైనిక ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి.