Threats To Biden : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన ఇటీవల కలకలం రేపింది. ఈ ఘటన జరిగి కొన్ని రోజులైనా గడవకముందే.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా ఓ వ్యక్తి వార్నింగ్స్ ఇచ్చాడు. ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల జాసన్ పాట్రిక్ ఆల్డే బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేశామని ఫ్లోరిడా ఉత్తర జిల్లాలోని అమెరికా అటార్నీ కార్యాలయం తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని క్విన్సీకి చెందిన ఆల్డే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Threats To Biden), ఇతర ఫెడరల్ అధికారులకు బెదిరింపు మెసేజ్‌లు పంపాడని విచారణలో గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
గత నెలలో ఫ్లోరిడాలోని తల్లాహస్సీలో ఉన్న ఓ మెంటల్ హెల్త్ హాస్పిటల్‌కు వెళ్లిన ఆల్డే.. అక్కడ బైడెన్‌కు(Biden) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. ఆ తర్వాత ఎక్స్ అకౌంటులోనూ అతడు బైడెన్‌కు వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. గత శనివారం రోజు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో 20 ఏళ్ల ముష్కరుడు థామస్ మాథ్యూ క్రూక్స్ జరిపిన కాల్పుల్లో 78 ఏళ్ల ట్రంప్ చెవికి గాయమైంది. హంతకుడిని అప్పటికప్పుడే అమెరికా సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు కాల్చి చంపారు.
Also Read :Buffalo Raped: గేదెపై సామూహిక అత్యాచారం
జో బైడెన్‌కు కొవిడ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మళ్లీ కొవిడ్ సోకింది. ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. లాస్ వెగాస్‌లో ఎన్నికల ప్రచారంలో ఉండగా బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం బైడెన్ డెలావేర్‌లోని తన ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూ కొవిడ్ మందులు తీసుకుంటున్నారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. తనకు అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగుతానని బైడెన్ ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే.. ఆయనకు కొవిడ్ నిర్ధారణ కావడం గమనార్హం.
బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్
వయసురీత్యా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకోవడం మేలనే అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది. ఈనేపథ్యంలో బైడెన్‌కు బదులుగా కమలా హ్యారిస్ పేరును డెమొక్రటిక్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో జో బైడెన్ ఇచ్చిన ఒక హింట్ ఆసక్తికరంగా మారింది.అమెరికా అధ్యక్షరాలయ్యే సామర్థ్యం కమలా హ్యారిస్‌కు ఉందని నేషనల్ అసోసియేష్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వార్షిక సదస్సులో బైడెన్ అన్నారు. ‘‘కమలా హ్యారిస్ గొప్ప ఉపాధ్యక్షురాలే కాదు, ఆమె అమెరికా అధ్యక్ష పదవికీ సమర్థురాలు’’ అని బైడెన్ పేర్కొన్నారు. అయితే అదే సందర్భంలో తాను అధ్యక్ష అభ్యర్థిగా వెనుదిరగబోననే నిర్ణయాన్ని కూడా బైడెన్ స్పష్టంగా చెప్పారు. తాను రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలి వంద రోజుల్లో చేపట్టే ప్రణాళికలను ఇప్పటికే రూపొందించుకున్నట్టు బైడెన్ తెలిపారు.