Site icon HashtagU Telugu

Cross-Sea Bullet Train: చైనాలో తొలి క్రాస్ సీ బుల్లెట్ ట్రైన్, గంటకు 350 కిలోమీటర్లు

Cross Sea Bullet Train

Cross Sea Bullet Train

Cross-Sea Bullet Train: ఒకప్పుడు బులెట్ ట్రైన్ అంటే జపాన్ గుర్తుకు వచ్చేది. జపాన్ విశ్వసనీయ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.బుల్లెట్ రైలు విషయంలో కూడా జపాన్ ఈ ప్రత్యేకతను కొన‌సాగించింది.అయితే ఇప్పుడు ఆ దారిలోకి చైనా వచ్చి పడింది. చైనాలో తొలి క్రాస్ సీ బుల్లెట్ ప్రారంభమైంది. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది

అభివృద్ధి రేసులో చైనా ముందంజలో ఉంది, అందుకే నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా చైనా మరో ముందడుగేసింది. సముద్రంపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల తొలి హై స్పీడ్‌ రైల్వే మార్గాన్ని చైనా ప్రారంభించింది. పుజియాన్‌ ప్రావిన్స్‌లో రెండు ప్రధాన నగరాలు ఫుజౌ-జియామెన్‌ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ లైన్‌ను ప్రారంభించింది. ఈ మార్గంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంట సమయం తగ్గనుంది. మొత్తం 277 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఫుజౌలో ప్రారంభమై జియామెన్‌ మీదుగా వెళ్లి జాంగ్‌జౌలో ముగుస్తుంది. ఇంటెలిజెండ్‌ రోబోట్‌లు, పర్యావరణ అనుకూల పదార్థాలతో ఈ క్రాస్‌-సి బ్రిడ్జ్‌ను నిర్మించారు.ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు గమ్యాన్ని చేరుకోవడానికి మూడు తీర వంతెనలను దాటుతుంది.

కొత్త లైన్ ప్రారంభంతో పెట్టుబడులు మరియు రవాణా సులభతరం అవుతుందని చైనా భావిస్తోంది. ఈ రాష్ట్రం నుండి తైవాన్‌కు మంచి లింకప్ లైన్ కూడా ఉంటుంది. దీనితో పాటు చైనా తన హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో మోనోరైల్ లైన్‌ను ప్రారంభించింది. ఇది పదిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్. తద్వారా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చైనా తన రైలు నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

Also Read: Lokesh Hunger Strike : రేపు ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష.. చంద్రబాబు, భువనేశ్వరి దీక్షకు సంఘీభావం