Site icon HashtagU Telugu

Ferry Capsize : పడవ బోల్తా.. 38 మంది మృతి.. 100 మందికిపైగా గల్లంతు

Ferry Capsize In Congo Busira River Christmas 2024

Ferry Capsize : కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుసిరా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 38 మంది చనిపోగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 24 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నందు వల్లే.. సముద్రం మధ్యలో పడవ అదుపుతప్పి బోల్తాపడిందని వెల్లడైంది. ప్రమాదం జరిగిన టైంలో పడవలో దాదాపు 400 మందికిపైగా ప్రయాణికులు(Ferry Capsize) ఉన్నట్లు తెలిసింది. వాళ్లంతా క్రిస్మస్ వేడుకల కోసం తమతమ సొంతూళ్లకు బయలుదేరగా ఈ విషాద ఘటన జరిగింది. సముద్రంలో మునగకుండా పడవకు రక్షణ కల్పించే ఫ్లోటేషన్ పరికరాలను ఈ పడవలో బిగించలేదని అధికార వర్గాలు గుర్తించాయి. ఒకవేళ ఫ్లోటేషన్ పరికరాలను పడవలో బిగించి ఉంటే ప్రాణ నష్టం తగ్గేదని అంటున్నారు.

Also Read :16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?

నాలుగురోజుల కిందట కూడా కాంగో పరిధిలోని ఓ నదిలో పడవ బోల్తా పడింది. ఆ ఘటనలో 25 మంది చనిపోయారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని పడవల ప్రయాణ సర్వీసులు నడిపే ఆపరేటర్లకు కాంగో అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ప్రతీ రవాణా సర్వీసు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలనే అత్యాశతోనే కెపాసిటీకి మించి ప్రయాణికులతో పడవలు రాకపోకలు సాగిస్తున్నాయి.  అలాంటి పడవలే తరుచుగా ప్రమాదాల బారినపడుతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు విషాదం మిగులుతోంది.

Also Read :KTR Vs ED : వచ్చే వారం కీలకం.. కేటీఆర్ విషయంలో ఈడీ, ఏసీబీ ఏం చేయబోతున్నాయి ?

ఈ ఏడాది అక్టోబరులో కాంగోలోని తూర్పు తీరంలో ఒక బోటు సముద్రంలో మునిగింది.  ఆ ఘటనలో దాదాపు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఈ ఏడాది జూన్‌లోనూ కాంగోలోని కిన్‌షాసా ఏరియా సమీపంలోని సముద్ర జలాల్లో పడవ మునగడంతో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం మీద ఏటా కాంగోలో వందలాది మంది పడవ ప్రమాదాల్లోనే ప్రాణాలను కోల్పోతుండటం విషాదకరం.