Site icon HashtagU Telugu

New York : అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..

Fazil Khan

Fazil Khan

జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు అమెరికా వెళ్లిన భారత యువకుడు అనుకోని సంఘటనతో ప్రాణాలు కొల్పోయాడు. భారత్‌కు చెందిన ఫాజిల్‌ ఖాన్‌ (Fazil Khan) (27) గతంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో కాపీ ఎడిటర్‌గా పనిచేశాడు. అయితే జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. అనంతరం అతడు అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం ఫాజిల్‌ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈబైక్‌ బ్యాటరీ (E Bike Battery) కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వేగంగా భవనం మొత్తం చెలరేగాయి. దీంతో భవనంలో చిక్కుకుపోయిన ఫాజిల్‌ (Fazil Khan) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో సుమారు 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు కిటికీల్లోంచి బయటకు దూకేశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంపై స్పందించని భారత కార్యాలయం.. ఫాజిల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉన్నామని, మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపింది.

Read Also : Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ