ముగ్గురు హిజ్రాల (Transgenders)ను హత్య చేసిన కేసులో పాకిస్థాన్‌లోని పంజాబ్ మాజీ మంత్రి అజ్మల్ చీమా (Ajmal Cheema) కుమారుడు అహ్మద్ బిలాల్ చీమా (Ahmed Bilal Cheema)కి సియోల్‌కోట్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2008లో జరిగిన ఈ ఘటనపై తాజాగా తీర్పు వెలువరించింది.
2008లో పంజాబ్ ప్రావిన్స్‌లో ముగ్గురు నపుంసకులను హత్య చేసిన కేసులో మాజీ మంత్రి కుమారుడికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. పంజాబ్ మాజీ మంత్రి అజ్మల్ చీమా కుమారుడు అహ్మద్ బిలాల్ చీమా 2008లో సియాల్‌కోట్‌లోని తన ఔట్‌హౌస్‌లో ట్రాన్స్‌జెండర్లు మజార్ హుస్సేన్, అమీర్ షాజాద్, అబ్దుల్ జబ్బార్‌లను కాల్చి చంపాడు. సియాల్‌కోట్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. బాధితుల్లో ప్రతి ఒక్కరి బంధువులకు 5,00,000 పాకిస్థానీ రూపాయిలు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో దోషి ఆరు నెలల అదనపు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Also Read: Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!
పోలీసుల కథనం ప్రకారం.. చీమా తన ఇంటి వెలుపల ఉన్న నపుంసకులను డ్యాన్స్ పార్టీకి ఆహ్వానించాడు. చీమా, అతని స్నేహితుల డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించడానికి నపుంసకులు నిరాకరించడంతో వారిపై కాల్పులు జరిపారు. నపుంసకులు అక్కడికక్కడే మరణించారు. తర్వాత చీమా అమెరికాకు పారిపోయాడు. ఈ ఏడాది జులైలో అతను పాకిస్థాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పోలీసులు అతన్ని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. తరువాత విచారణ ప్రారంభమైంది. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ బిలాల్ చీమా కుటుంబం బాధితుల బంధువులకు డబ్బు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే బాధితుల కుటుంబం డబ్బును స్వీకరించడానికి నిరాకరించింది.