Imran Wife Vs Ex Husband : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71), ఆయన భార్య బుష్రా బీబీ(49)లను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. ఈసారి వీరిని ప్రభుత్వం టార్గెట్ చేయలేదు. ఇమ్రాన్ భార్య బుష్రా మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా న్యాయపోరాటం మొదలుపెట్టారు. తన కాపురాన్ని కూల్చేసి.. జీవితాన్ని నాశనం చేసి.. అక్రమ రీతిలో తన మాజీ భార్య బుష్రాను ఇమ్రాన్ ఖాన్ 2018 జనవరి 1న పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలతో ఖవార్ ఫరీద్ కేసు వేశారు. ఇస్లామాబాద్ తూర్పు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ పిటిషన్(Imran Wife Vs Ex Husband) దాఖలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
తన భార్యగా ఉండగానే బుష్రాతో ఇమ్రాన్ వ్యభిచారం నెరిపారనే సంచలన ఆరోపణ కూడా ఖవార్ ఫరీద్ చేయడం గమనార్హం. ప్రత్యేకమైన ఫోన్ నంబరు, ఫోన్ ఇచ్చి.. రాత్రివేళ టైం కాని టైంలో కాల్ చేసి బుష్రాతో ఇమ్రాన్ మాట్లాడేవారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినే ముసుగులో తాను లేనప్పుడు తరుచూ తన ఇంటికి ఇమ్రాన్ ఖాన్ వచ్చేవారని, అది అనైతికమని బుష్రా బీబీ మాజీ భర్త ఖవార్ ఫరీద్ ఆరోపించారు. ఇమ్రాన్‌తో కలిసి మాజీ భార్య బుష్రా చేస్తున్న ఈ ఘోరమంతా చూస్తూ భరించలేక.. 2017 నవంబర్ 14న తాను విడాకులు ఇచ్చానని కోర్టుకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.
Also Read: Ayyan App : అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్ యాప్’
ఈ కేసులో ముగ్గురు సాక్షులు ఇస్తేఖామ్-ఏ-పాకిస్తాన్ పార్టీ సభ్యుడు అవున్ చౌదరి, ఇమ్రాన్ -బుష్రాలకు నిఖా నిర్వహించిన ముఫ్తీ ముహమ్మద్ సయీద్, ఖవార్ ఫరీద్ ఇంటి పనిమనిషి లతీఫ్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 28న సాక్ష్యం చెప్పేందుకు హాజరుకావాలని వారిని ఆదేశించింది. పాక్ సార్వత్రిక ఎన్నికలకు మరో 50 రోజులే టైమే ఉంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ వివిధ అవినీతి కేసుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలులో ఉన్నారు. తాజాగా ఈ కేసుతో ఇమ్రాన్ ప్రతిష్ఠ మసకబారుతుందని, మహిళల్లో ఆయన ఇమేజ్ దెబ్బతింటుందనే టాక్ వినిపిస్తోంది.