Site icon HashtagU Telugu

Turkey Election Results: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగన్ విక్టరీ…

Turkey Election Results

29 05 2023 Recep Tayyip Erdogan 23426157

Turkey Election Results: టర్కీ సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి విజయం సాధించారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన దేశ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది టర్కీ విజయమని ఆయన అభివర్ణించారు. కాగా ప్రత్యర్థి కెమల్ కిలిక్‌దరోగ్లును బై-బై-బై..కెమల్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తికాగా అనూహ్య ఫలితాల్లో ఎర్డోగన్ విజయం సాధించారు. దీంతో ఎర్డోగన్ వచ్చే ఐదేళ్లపాటు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఎర్డోగన్‌కు 52 శాతం ఓట్లు రాగా, కిలిక్‌డరోగ్లుకు 48 శాతం ఓట్లు పోలయ్యాయని అక్కడ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లో తుది ఫలితాలు ప్రకటించకముందే ఎర్డోగాన్ మద్దతుదారులు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. వీధుల్లో ఎర్డోగన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎర్డోగన్ పార్టీ జెండాను ఊపుతూ నగర వీధులన్నీ తిరిగారు.

నిజానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను పాక్ అనుకూల, భారత వ్యతిరేకిగా పరిగణిస్తారు. ఐక్యరాజ్యసమితిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఆయన పలుమార్లు లేవనెత్తారు. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)లో టర్కీ మాత్రమే ముస్లిం సభ్య దేశం. దాని భౌగోళిక స్థానం కారణంగా టర్కీకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.

Read More: Gold Seized : జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం