Musharrafs Family Property : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఢిల్లీలోనే జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీకి చెందిన బేగం జరీన్ ముషారఫ్, సయ్యద్ ముషారఫుద్దీన్ దంపతులకు పర్వేజ్ ముషారఫ్ జన్మించారు. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. వారికి అప్పట్లో మన దేశంలో చాలానే ఆస్తిపాస్తులు ఉండేవి. వాటిలోనే ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పత్ జిల్లా బడౌత్ తహసీల్‌లోని కొటానా గ్రామంలో ఉంది. భారత్, పాక్ విభజన జరగడంతో పర్వేజ్ ముషారఫ్ కుటుంబం అకస్మాత్తుగా భారత్ విడిచి వెళ్లిపోయింది. దీంతో భారత్‌లోని వాళ్ల ఆస్తులు అలాగే ఉండిపోయాయి. మన దేశంలో పాకిస్తానీలు వదిలి వెళ్లిపోయిన ఆస్తులను భారత ప్రభుత్వం ‘శత్రు ఆస్తులు’గా పరిగణిస్తుంది. వీటిని కేంద్ర హోంశాఖకు చెందిన కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ(Musharrafs Family Property) విభాగం నిర్వహిస్తుంటుంది.
Also Read :Boeing Starliner : సునితా విలియమ్స్ లేకుండానే భూమికి బయలుదేరిన స్టార్ లైనర్.. ఎందుకు ?
2010 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొటానా గ్రామంలో ముషారఫ్ పూర్వీకులకు చెందిన రెండు హెక్టార్ల భూమిని కేంద్ర సర్కారు గుర్తించింది. తాజాగా దాన్ని వేలం వేయగా భారత ప్రభుత్వానికి రూ.1.38 కోట్లు వచ్చాయి. ‘‘పర్వేజ్ ముషారఫ్ తాత కొటానా గ్రామంలో నివసించేవారు. వీరి కుటుంబానికి ఇక్కడ ఉమ్మడి ఆస్తి ఉండేది. ముషారఫ్ మామ హుమయూన్ నివసించిన ఇల్లు కూడా ఈ ఊరిలోనే ఉంది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read :Vinesh Phogat Contest From Julana: జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వినేష్ ఫోగట్..!
పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక సంచలనం. 1999 సంవత్సరంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా ఉన్న టైంలో పాకిిస్తాన్‌లో సైనిక తిరుగుబాటు చేశారు. తద్వారా అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 2023 సంవత్సరంలో పర్వేజ్ ముషారఫ్ చనిపోయారు. పర్వేజ్ ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్ ఉన్నత విద్యావంతుడు. భారత్‌లో బ్రిటీష్ పాలన సాగుతున్న టైంలో ఆయన సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసు అధికారిగా సేవలు అందించారు. పర్వేజ్ ముషారఫ్ ముత్తాత కూడా బ్రిటీష్ వాళ్ల దగ్గర ట్యాక్స్ కలెక్టర్‌గా పనిచేసేవారు. ముషారఫ్ తాత జడ్జిగా పనిచేసేవారు. ముషారఫ్ తల్లి జరీన్ 1920 సంవత్సరంలో లక్నోలో జన్మించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇంద్రప్రస్థ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు.