Elon Musk Vs Indian Voters: అమెరికా రాజకీయాలు, ప్రభుత్వాలపై ధనిక పెట్టుబడిదారుల ప్రభావం చాలా ఎక్కువ. అందుకే అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో చక్రం తిప్పగలుగుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపులోనూ ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. అందుకు ప్రతిఫలంగా ఎలాన్ మస్క్‌కు ట్రంప్ ప్రభుత్వంలోని కీలకమైన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (డోజ్) విభాగం సారథి పోస్టు దక్కింది. ఈ హోదాలో మస్క్ వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన భారతదేశ ఓటర్లతో ముడిపడిన ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలివీ..
Also Read :Bill Gates A Farmer : ‘వ్యవసాయం’లోనూ దునియాను దున్నేస్తున్న బిల్‌గేట్స్ .. ఎలా ?
భారతదేశ ఎన్నికలకు..
అమెరికా ప్రభుత్వం దుబారా ఖర్చులకు కోత పెట్టడం, అదనపు ప్రభుత్వ ఉద్యోగులను ఇళ్లకు సాగనంపడం అనేవి ‘డోజ్’ విభాగం ప్రధాన లక్ష్యాలు. అమెరికా సర్కారు ప్రపంచ దేశాలకు వివిధ రకాల కార్యక్రమాల అమలు కోసం ఏటా నిధులను సమకూరుస్తుంటుంది. ఈక్రమంలోనే భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను(Elon Musk Vs Indian Voters), పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందించే రూ.182 కోట్ల (21 మిలియన్ డాలర్ల) నిధిని డోజ్ సారథి ఎలాన్ మస్క్ రద్దు చేశారు. ఈ నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఘాటుగా స్పందించారు.
Also Read :Made in India: త్వరలోనే మేడిన్ ఇండియా చిప్.. ఏమిటిది ? ఎవరు తయారు చేస్తారు?
అమెరికా నిధులా ? మాకైతే ఏమీ తెలియదు : బీజేపీ
‘‘భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా ? ఆ డబ్బులు భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష భాగం కాదు. ఆ నిధులను ఎవ్వరూ భారత ఎన్నికల్లో నేరుగా వినియోగించరు. అమెరికా నిధుల వల్ల ఎవరు లాభపడుతున్నారు? అధికార పార్టీ(బీజేపీ) మాత్రం లబ్ధిపొందడం లేదు’’ అని పేర్కొంటూ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపర్చేందుకు అందిస్తున్న 29 మిలియన్ డాలర్ల నిధులను కూడా ఎలాన్ మస్క్ కోత పెట్టారు. నేపాల్, కంబోడియా, దక్షిణాఫ్రికా, లైబీరియా, సెర్బియా, మొజాంబిక్, కొసావో సహా పలు దేశాలకు ఇచ్చే వివిధ రకాల ఫండ్లను కూడా నిలుపుదల చేస్తూ డోజ్ సారథి నిర్ణయం తీసుకున్నారు.