Site icon HashtagU Telugu

Earthquake: మెక్సికో, గ్వాటెమాలాలో 6.4 తీవ్రతతో భూకంపం

Chile Earthquake

Chile Earthquake

మెక్సికో, గ్వాటెమాలాలో భూకంపం (Earthquake) సంభవించింది. నివేదికల ప్రకారం.. మధ్య అమెరికా దేశం, దక్షిణ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో 6.4 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.

భూకంప తీవ్రత 6.4గా నమోదైంది

US జియోలాజికల్ సర్వే (USGS) 252 కిలోమీటర్ల (156.6 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దాని కేంద్రం గ్వాటెమాలలోని కెనిలా మునిసిపాలిటీకి ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. భూకంపం తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

గ్వాటెమాల, మెక్సికోలో ఎటువంటి నష్టం జరగలేదు

భూకంపం వల్ల తక్షణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని గ్వాటెమాల ప్రకృతి విపత్తు ఏజెన్సీ తెలిపింది. ఇంతలో దక్షిణ మెక్సికన్ రాష్ట్రం చియాపాస్‌లోని పౌర రక్షణ అధికారులు ఆస్తికి ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని పొరుగు దేశం ఎల్ సాల్వడార్ ట్వీట్ చేసింది.

Also Read: Heat Waves : ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. నేడు ఎనిమిది మండ‌లాల్లో వేడిగాలులు వీచే అవకాశం

భూకంపాలు ఎందుకు వస్తాయి..?

భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.

భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం.. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.