ఇప్పటికే ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్(Pakistan)కు ప్రకృతి సైతం కోలుకోకుండా చేస్తుంది. వరుసగా భూకంపాలు (Earthquake ) కలవరపెడుతున్నాయి. తాజాగా ఈరోజు మే 30వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 180 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తో పాటు ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.
PM Modi Warned Pakistan: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక!
ఇక వారం రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌లో నమోదైన మూడవ భూకంపం కావడం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. ఇప్పటికే సోమవారం 4.6 తీవ్రతతో మరో భూకంపం చోటు చేసుకుంది. పాక్ పలు ప్రాంతాల్లో భూకంపాల భయం ప్రజలను వెంటాడుతుంది. వరుస భూకంపాలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశముండటంతో, అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
పాకిస్తాన్ భూగోళ పరంగా అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించబడింది. ఈ దేశం యురేషియా మరియు భారత టెక్టోనిక్ ప్లేట్‌ల మద్య విస్తరించి ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్, గిల్గిట్-బాల్టిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలు యురేషియా ప్లేట్ పై ఉండగా, సింధ్, పంజాబ్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భారత ప్లేట్ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు ప్లేట్‌లు ఒకదానితో ఒకటి ఢీకొనటమే భూకంపాలకు కారణమవుతోంది. ఆర్థికంగా తడబడిన పాక్‌కు, ప్రకృతి కూడా ఒత్తిడి పెంచుతున్న ఈ పరిస్థితులు మరింత సంక్షోభాన్ని తెస్తాయనే అంచనాలు నెలకొన్నాయి.