Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. తాజాగా గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 150 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అంచనా వేశారు. గత 15 రోజుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న నాలుగో భూకంపం ఇది. ఇటీవల హెరాత్ ప్రావిన్సులో సంభవించిన మూడు భూకంపాల్లో 4వేల మందికిపైగా ప్రజలు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అక్టోబర్ 15 న 5.4 తీవ్రతతో, అక్టోబర్ 13న 4.6 తీవ్రతతో, అక్టోబర్ 11న 6.1 తీవ్రతతో భూకంపాలు కుదిపేశాయి. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఒక్క హెరాత్ ప్రావిన్స్‌లోనే 20 గ్రామాల్లో దాదాపు 1,983 ఇళ్లు కూలిపోయాయి. ఎంతోమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ఈవివరాలను తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇండోనేషియాలోని మినాహాసాలో బుధవారం రాత్రి 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈవివరాలను యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) ధ్రువీకరించింది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మనాడోకు దక్షిణంగా 28 కి.మీ దూరంలో, 97 కి.మీ (60.27 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది.