Earthquake : రష్యాలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. కమ్‌చట్కా ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఈ భూప్రకంపనలను కమ్‌చట్కా రాజధాని పెట్రోపావ్‌లోవ్స్క్-కామ్‌చట్‌స్కీ సహా తీరప్రాంత ప్రజలు ఫీలయ్యారు. ఈవిషయాన్ని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. కమ్‌చట్కా ప్రాంతంలోని తూర్పు తీరంలో 51 కి.మీ లోతులో భూకంపం(Earthquake) వచ్చిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా కమ్‌చట్కా ప్రాంతంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే కమ్‌చట్కా ప్రాంత అధికారులు మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక బలగాలను రంగంలోకి దింపారు.
We’re now on WhatsApp. Click to Join
కమ్‌చట్కా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటల తర్వాత భూకంపం వచ్చింది. కమ్‌చట్కా ద్వీపకల్పం పసిఫిక్ మహాసముద్రంలోని “రింగ్ ఆఫ్ ఫైర్” ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కమ్‌చట్కా ప్రాంతంలో రెండు డజన్లకుపైగా క్రియాశీల అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్ల అమరిక బలహీనంగా ఉంటుంది. ఫలితంగా భూకంపాలు వచ్చే రిస్క్ మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటుంది.
Also Read :Kolkata Trainee Doctor : 43 మంది డాక్టర్లపై పశ్చిమబెంగాల్ సర్కార్ బదిలీ వేటు
భూకంపం అంటే ఏమిటి ?
భూమిలో క్రస్ట్ అనే పొర ఉంటుంది. ఆ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తినే భూకంపం అంటారు. దీనివల్ల భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు రిలీజ్ అవుతాయి. క్రస్ట్ పొరలో ఏర్పడే ఒత్తిళ్లు సాధారణంగానైతే రాతి పొర వరకు మాత్రమే వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఒకవేళ ఆ ఒత్తిళ్లు రాతి పొరను మించిపోయేలా ఉన్న అరుదైన సందర్భాల్లో అది భూమి క్రస్ట్ పొరలోని బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు వస్తాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు ఉన్న ఏరియాలలోని ప్రజలు ఫీలవుతారు.