Site icon HashtagU Telugu

US Voting : కమల వర్సెస్ ట్రంప్.. అమెరికాలో ‘ముందస్తు’ ఓట్ల పండుగ షురూ

In Person Voting In Us Elections

US Voting : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియ స్టార్ట్ అయింది.  అదేంటి.. నవంబరు 5వ తేదీన పోలింగ్ ఉంటే, ఇప్పుడే ఓటింగ్ ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారా ? మరేం లేదు..  మన దేశంలో మాదిరిగా అమెరికాలో ఎన్నికల నిబంధనలు దేశమంతా ఒకేలా ఉండవు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.  అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల కోసం అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ వెసులుబాటును ఓటర్లకు కల్పిస్తాయి. ముందస్తు ఓటింగ్‌కు సంబంధించి రెండు పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతిలో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటర్లు ఓటు వేస్తారు. మరో పద్ధతిలో పోస్ట్ ద్వారా ఓటర్లు ఓట్లు(US Voting)  పంపుతారు. ఇలా పోస్టులో వచ్చిన ఓట్లను ముందుగానే తెరిచి ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు.

Also Read :Apple Peels: ఆపిల్ తొక్కతో ఇన్ని లాభాలా..?

పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓట్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 11న అలబామా రాష్ట్రంలో మొదలైంది. ఈనెల 19న విస్కాన్సిన్ రాష్ట్రంలో, 20న మినెసోటా రాష్ట్రంలో ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. టెక్సాస్‌లో వచ్చే నెల 21న ముందస్తు ఓటింగ్‌ మొదలవుతుంది. ఈసారి అమెరికాలోని 47 రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్‌ కోసం ఓటర్లకు వెసులుబాటును కల్పించాయి. మేరీలాండ్, ఫ్లోరిడా, మసాచుసెట్స్, కనెక్టికట్‌ రాష్ట్రాలు ఇటీవలే ఈ తరహా విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.  అంటే..  డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ల భవితవ్యాన్ని తేల్చేందుకు అమెరికా ప్రజలు ముందస్తు ఓటింగ్‌‌ను మొదలుపెట్టేశారు.

Also Read :Raw Coconut Benefits: పచ్చి కొబ్బరి వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ముందస్తు ఓటింగ్‌ గడువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 50 రోజుల పాటు ఓటర్లకు అనుమతి ఇస్తున్నారు. ఇంకొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోలింగ్ తేదీ (నవంబరు 5కు) వారం ముందు వరకు ఛాన్స్ ఇస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీ సహా 23 రాష్ట్రాలు శని, ఆదివారాల్లో ముందస్తు ఓటింగ్‌‌ వేసేందుకు అనుమతిస్తున్నాయి. అలబామా, మిసిసిపి, న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌ లేదు. కొన్ని ప్రత్యేక కారణాలను చూపించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశాన్ని కల్పిస్తారు.

Exit mobile version