Boat Capsizes In Nigeria: నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి నైజర్ నదిలో పడవ బోల్తా (Boat Capsizes In Nigeria) పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతు అయ్యారు. ఎనిమిది మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. గల్లంతైనవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. వారందరూ వారాంతపు ఫుడ్ మార్కెట్‌కు పడవపై వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో 200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 100 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ!
పడవలో వ్యాపారులు ఉన్నారు
నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (NIWA) ప్రతినిధి మకామా సులేమాన్ మాట్లాడుతూ.. పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతున్నారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ చెప్పారు. ప్రయాణీకులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి
పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్‌లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు వంటి అంశాలు సాధారణంగా ఈ సంఘటనలకు కారణమని చెప్పవచ్చు.