TikTok Vs Facebook : ఫేస్‌బుక్‌ ప్రజల శత్రువు.. టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తే జరిగేది అదే : ట్రంప్

TikTok Vs Facebook : టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లపై అమెరికా మాజీ అధ్యక్షుడు 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 08:52 AM IST

TikTok Vs Facebook : టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లపై అమెరికా మాజీ అధ్యక్షుడు 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘టిక్‌టాక్’ అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఒకవేళ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తే.. ఫేస్‌బుక్ మరింత బలోపేతం అవుతుందని  పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే.. అమెరికా సోషల్ మీడియా మార్కెట్‌‌పై ఫేస్‌బుక్ గుత్తాధిపత్యాన్ని సాధించే రిస్క్ అలుముకుంటుందని ట్రంప్ చెప్పారు. ఫేస్‌బుక్‌ను అమెరికా ప్రజల శత్రువుగా ట్రంప్ అభివర్ణించారు.  ఫేస్‌బుక్‌కు చెక్ పెట్టేందుకైనా.. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయకుండా వదిలేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘నిజంగా చెప్పాలంటే.. టిక్‌టాక్‌‌ను ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. టిక్‌టాక్‌లో(TikTok Vs Facebook) చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. వారు అది లేకుండా పిచ్చిగా మారతారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాలోనూ టిక్ టాక్ బ్యాన్ ?

2020 జూన్‌లో చైనాతో సంబంధాలు క్షీణించిన తర్వాత, చైనా యాప్ టిక్‌టాక్‌ను భారత్ నిషేధించింది.  జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్ టాక్ (TikTok) సహా 100 ఇతర చైనీస్ యాప్‌లపై కేంద్ర సర్కారు అప్పట్లో బ్యాన్ విధించింది. అంటే గత నాలుగేళ్లుగా మన దేశంలో టిక్ టాక్ అందుబాటులో లేదు. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ భారత ప్రజల సమాచారాన్ని సేకరిస్తోందనే అభియోగాలతో దానిపై కేంద్ర సర్కారు నిషేధాన్ని ప్రకటించింది.  ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే విధమైన అభియోగాలతో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మంగళవారం అమెరికా పార్లమెంట్‌లో ఎంపీలు సమర్పించిన బిల్లులో చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘ది ప్రొటెక్టింగ్ అమెరికన్స్ ఫ్రమ్ ఫారిన్ అడ్వర్సరీ కంట్రోల్డ్ అప్లికేషన్స్ యాక్ట్’లో, కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉందని ఆరోపించింది. ఈ యాప్ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించబడింది.

Also Read :Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర.. ఎంతో తెలుసా ?

ఇదే తొలిసారేం కాదు.. 

అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతేడాది రిపబ్లికన్‌ పార్టీ తీసుకొచ్చిన బిల్లు టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించేలా ప్రయత్నించింది, అంతే కాకుండా సెనేటర్ ఒక చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఇది అమెరికా అధికారులకు అధికారం ఇచ్చింది. ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించి నిషేధించండి. అయితే రెండు బిల్లులు ఆమోదం పొందలేకపోయాయి.

Also Read : CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్