Trump Vs 41 Countries : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏకంగా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ లిస్టులో భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌పై తాత్కాలిక వీసా సస్పెన్షన్ అమలయ్యే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై పూర్తిస్థాయి ట్రావెల్ బ్యాన్ అమలవుతుంది. భారత్ మిత్రదేశాలైన ఇరాన్, మయన్మార్, క్యూబాలపైనా ట్రావెల్ బ్యాన్‌ను విధించనున్నట్లు తెలిసింది. అంతర్యుద్ధాలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్‌లపైనా పూర్తిస్థాయి బ్యాన్ విధిస్తారు.
Also Read :YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
41 దేశాలు.. 3 గ్రూపులు
అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించనున్న 41 దేశాలను(Trump Vs 41 Countries) మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో పది దేశాలు ఉన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు వీసాల జారీని ఆపేయనున్నారు. రెండో గ్రూప్‌లో ఎరిత్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటికి పర్యాటక, విద్యార్థి వీసాలను జారీ చేయొద్దని ట్రంప్ భావిస్తున్నారు. మూడో గ్రూపులో పాకిస్తాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్నాయి. ఇవి 60 రోజుల్లోగా తమ లోపాలను పరిష్కరించుకోకుంటే అక్కడి పౌరులకు వీసాల జారీని పాక్షికంగా ఆపేస్తారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read :Men Vs Marriage : పురుషుల బరువుకు పెళ్లితో లింకు.. సంచలన నివేదిక
ముస్లిం దేశాలే టార్గెట్
గతంలో తొలిసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన సమయంలోనూ ఇదే విధంగా ట్రావెల్ బ్యాన్ విధించారు. అప్పట్లో ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిని అయితే గాజా, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్‌ల నుంచి పౌరులు రాకుండా ఆంక్షలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పారు. ఇప్పుడు ఆ మాటను అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.