Education Department : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగానే కాదు.. దుందుడుకుగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన అమెరికా ప్రభుత్వ విద్యాశాఖను మూసేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రిలీజ్ అవుతాయంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ట్రంప్ సర్కారుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు, అమెరికా ప్రజల విద్యాహక్కును దూరం చేస్తారా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
Also Read :Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్‌తో లింకులు ?
విద్యాశాఖ ఉనికి ప్రశ్నార్ధకం
ఇప్పటికే అమెరికా విద్యాశాఖలోని చాలామంది టీచర్లు, బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి ట్రంప్ తప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ప్రభుత్వ విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉండేవారు. ఆ తర్వాత వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి ముందుకొచ్చారు. తదుపరిగా విద్యాశాఖనే(Education Department) పీకేయాలని ఆయన యోచిస్తున్నారు. ఇకపై ప్రభుత్వ విద్యాశాఖను అమెరికా సర్కారు నిర్వహించదు. దాని బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తారు. విద్యాశాఖను నిర్వహించాలా ? వద్దా ? అనే దానిపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. అమెరికా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల విద్యాశాఖలకు మాత్రం నిధులు అందవు. అంటే.. అమెరికాలో ప్రభుత్వ విద్యాశాఖకు గడ్డుకాలమేనన్న మాట. దాని ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్న మాట.
Also Read :UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
అంత ఈజీ కాదు..
అమెరికా ప్రభుత్వ విద్యాశాఖను తీసేయడం అనేది అంత ఈజీ విషయం కాదని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అమెరికాలోని అన్ని చట్టసభల ఆమోదం అవసరమని అంటున్నారు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునేందుకు విద్యాశాఖను తీసేస్తామంటే.. చట్టసభలు అంగీకరించవని చెబుతున్నారు. ఈ అంశంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను అమెరికాలోని రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకుంటాయనే అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తం అవుతోంది.