Trump Sons Fiancee : కాబోయే కోడలికి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి.. కొడుకుతో ఆమె నిశ్చితార్ధం‌పై సస్పెన్స్ ?

కింబర్లీ గిల్ఫోయిల్‌ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు అని ట్రంప్(Trump Sons Fiancee) వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Trump Sons Fiancee Kimberly Guilfoyle Us Ambassador To Greece

Trump Sons Fiancee : ‘‘ఏ దేశ రాజకీయం చూసినా.. ఏమున్నది గర్వ కారణం.. ఎక్కడ చూసినా కొన్ని కుటుంబాల పెత్తనమే విస్పష్టం’’. డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా  జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన ప్రభుత్వ మంత్రిమండలి కోసం ఉద్దండులైన వారిని ట్రంప్ ఎంపిక చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన తన కుమార్తె టిఫానీ మామ మసాద్‌ బౌలోస్‌ను అరబ్‌, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్‌ సలహాదారుగా నియమించారు. ట్రంప్ తన కుమార్తె ఇవాంక మామ ఛార్లెస్‌ కుష్నర్‌‌ను ఫ్రాన్స్‌కు అమెరికా రాయబారిగా నియమించారు.  ఈక్రమంలోనే మరో సంచలన వ్యక్తిని తన ప్రభుత్వంలోకి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆమె పేరు.. కింబర్లీ గిల్ఫోయిల్‌. డొనాల్డ్ ట్రంప్ కుమారుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు కాబోయే భార్యే ఈ కింబర్లీ గిల్ఫోయిల్‌.ఈమెను గ్రీస్‌కు అమెరికా రాయబారిగా పంపుతానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈవిషయాన్ని తన సోషల్ మీడియా కంపెనీ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన అనౌన్స్  చేశారు. మొత్తం మీద తన కాబోయే కోడలికి ప్రభుత్వంలో ట్రంప్ చోటు కల్పించారు.

Also Read :Bharat Antariksha Station : 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం రెడీ.. 2040కల్లా చంద్రుడిపైకి భారతీయుడు

కింబర్లీ గిల్ఫోయిల్‌ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు అని ట్రంప్(Trump Sons Fiancee) వెల్లడించారు. అయితే తన కుమారుడితో  ఆమె బంధం గురించి మాత్రం ట్రంప్ వివరణ ఇవ్వలేదు. న్యాయవ్యవస్థ, మీడియా, రాజకీయాల్లో గిల్ఫోయిల్‌‌కు అనుభవం ఉందన్నారు. అందుకే ఆమెకు తన ప్రభుత్వంలో చోటును కల్పిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.  గ్రీస్‌ దేశంతో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు వంటి విభాగాల్లో  సంబంధాల బలోపేతానికి  గిల్ఫోయిల్ ప్రయత్నాలు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read :Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!

కింబర్లీ గిల్ఫోయిల్‌‌‌తో  నిశ్చితార్ధం రద్దు చేసుకున్నారా ?   

  • డొనాల్డ్‌ ట్రంప్‌  జూనియర్‌తో కింబర్లీ గిల్ఫోయిల్‌‌కు  2020 డిసెంబరు 31న పెళ్లికి సంబంధించిన నిశ్చితార్ధం జరిగింది.
  • గతంలో ఆమె ఫాక్స్‌న్యూస్‌ ఛానల్‌లో హోస్ట్‌గా పనిచేశారు.
  • కొంతకాలం పాటు రిపబ్లికన్ రాజకీయ పార్టీకి విరాళాలు సేకరించే టీమ్‌లో పనిచేశారు.
  • డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలలో తెర వెనుక నుంచి కింబర్లీ గిల్ఫోయిల్ కీలక పాత్ర పోషించారు.
  • మరో అమ్మాయితో డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రస్తుతం అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ఓ అమ్మాయి చేయి పట్టుకొని నడుస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కింబర్లీతో నిశ్చితార్థాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల వేళ ట్రంప్‌ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
  • డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌‌కు ఇదివరకే పెళ్లయింది. ఆయన మొదటి భార్య పేరు వానెసా. వానెసా ద్వారా డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఐదుగురు సంతానం కలిగారు. వానెసా నుంచి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ విడిపోయారు.
  Last Updated: 11 Dec 2024, 02:38 PM IST