Site icon HashtagU Telugu

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ఎన్నో మైనస్ పాయింట్లు

Us President Donald Trump Nobel Peace Prize

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. వికీ లీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజే, రష్యా ప్రతిపక్షనేత దివంగత అలెక్సీ నావెల్సీ భార్య యూలియా నావల్నయాల కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం 338 మంది అభ్యర్థులను ఈ ఏడాది మార్చి 5న నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ నామినేట్ చేసింది. వీరిలో 244 మంది వ్యక్తులు ఉండగా, 94 సంస్థలు ఉన్నాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో నామినేటెడ్ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 2024లో కేవలం 286 మందే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ట్రంప్ ఇంతకుముందు కూడా అనేకసార్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.  కానీ పురస్కారం మాత్రం వరించలేదు.  ఈసారీ అదే జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారు. ఈ జాబితాలో ట్రంప్ కూడా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రైజ్‌ను అందుకున్న అమెరికా ప్రెసిడెంట్లలో థియోడర్ రూజ్వెల్ట్(1906), వుడ్రో విల్సన్(1919), జిమ్మీ కార్టర్(2002), బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఇక నోబెల్ ప్రైజ్ విజేతలను ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లో నగరంలో వీటిని ప్రదానం చేస్తారు.

Also Read :Jr NTR : జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు ప్రైవేటు విమానం ఉందా ?

ట్రంప్‌కు ఎన్నో మైనస్ పాయింట్లు

Also Read :Pakistan Vs IndiGo : ‘ఇండిగో‌’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?