Gold Rush : బంగారం నిల్వల కోసం ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఎగబడుతున్నాయి. భారత్ నుంచి మొదలుకొని అమెరికా దాకా అదే పరిస్థితి ఉంది. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న వాల్ట్‌ల నుంచి తమ పసిడి నిల్వలను అమెరికా బ్యాంకులు జేపీ మోర్గాన్ చేజ్, హెచ్‌ఎస్‌బీసీ వంటివి విమానాల్లో వెనక్కి తెచ్చుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు అమెరికాలో బంగారం రేటు పెరుగుతోంది. అక్కడ ఔన్సు బంగారం రేటు రూ.2.60 లక్షలు ఉంది. 1 ఔన్సు అనేది 28.3495 గ్రాములకు సమానం.
Also Read :Mahayuti Tussle: ‘మహా’ చీలిక జరుగుతుందా ? షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ డౌన్
ఎందుకీ గోల్డ్ రష్ ?
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Gold Rush) అన్నీ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ప్రత్యేకించి అవన్నీ విదేశాలకు ట్రబుల్ కలిగించే నిర్ణయాలే. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్, చైనా సహా చాలా దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. త్వరలో బంగారంపై సైతం ట్రంప్ పన్నులను విధిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికాలోని బ్యాంకులు లండన్‌లోని వాల్ట్‌ల నుంచి బంగారాన్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ఫలితంగా అమెరికాలో బంగారం ధరలు పెరుగుతుంటే, బ్రిటన్‌లో గోల్డ్ రేట్లు తగ్గిపోతున్నాయి.
Also Read :Grok 3 AI : ‘గ్రోక్ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?
లండన్ వాల్ట్స్ గురించి..
- భారత్, అమెరికా సహా చాలా ప్రపంచ దేశాలు తమ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లండన్‌లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో ఉన్న గోల్డ్ వాల్ట్స్‌లో దాచాయి.
- థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో 9 బంగారం నిల్వ వాల్ట్‌లు ఉన్నాయి. వీటిలో దాదాపు 100 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడి విలువ దాదాపు 252 బిలియన్ డాలర్లు.
- ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం నిల్వ లండన్‌లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో ఉన్న గోల్డ్ వాల్ట్స్‌లోనే ఉంది.
- ఫిబ్రవరి నెలలో దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని లండన్ నుంచి అమెరికాకు తరలించాలని జేపీ మోర్గాన్ ప్లాన్ చేస్తోంది.
- చివరిసారిగా 2020 సంవత్సరంలో కరోనా సంక్షోభం కారణంగా స్విట్జర్లాండ్‌లోని బంగారం రిఫైనరీలు మూతపడ్డాయి. దీంతో అప్పట్లో కూడా లండన్ నుంచి ఇదే విధంగా భారీగా బంగారాన్ని అమెరికాకు తరలించుకున్నారు.
- 2024 సంవత్సరం నవంబరు 5 నాటికి అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో 106 బిలియన్ డాలర్ల విలువైన పసిడి నిల్వలు ఉన్నాయి.
- 2024 సంవత్సరం మే నెలలో ఇంగ్లాండ్ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను మన దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ తీసుకొచ్చింది.దాదాపు లక్ష కిలోల పసిడిని మన దేశ ఖజానాలో చేర్చింది.
- ముంబై మింట్ రోడ్, నాగ్‌పుర్‌లోని ఆర్‌బీఐ పాత కార్యాలయాల్లో బంగారాన్ని ఆర్‌బీఐ నిల్వ చేస్తుంటుంది.