Trump Hush Money Case: పోర్న్ స్టార్‌కు ట్రంప్ మనీ ఇచ్చాడా? ఈ రోజు తేల్చనున్న కోర్టు

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు ఇచ్చిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఈరోజు అంటే ఏప్రిల్ 15న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్ మరియు సినీ నటి స్టార్మీ డేనియల్స్ ఇద్దరూ కోర్టు కు హాజరు కావాల్సి ఉంది

Published By: HashtagU Telugu Desk
Donald Trump Hush Money Case

Donald Trump Hush Money Case

Trump Hush Money Case: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు ఇచ్చిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఈరోజు అంటే ఏప్రిల్ 15న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్ మరియు పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్ ఇద్దరూ కోర్టు కు హాజరు కావాల్సి ఉంది. అంతకుముందు ఈ కేసు విచారణను పొడిగించాలని ట్రంప్ మూడుసార్లు కోర్టును ఆశ్రయించారని, అయితే కోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. ఈ మేరకు కేసు విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది.

నవంబర్‌లో జరగనున్న ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ట్రంప్‌ కోర్టుకు హాజరుకానుండటంతో ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడనుంది. అమెరికా అధ్యక్ష చరిత్రలో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ డబ్బు ఇచ్చిన కేసు 2016 నాటిది. వాస్తవానికి ఈ పోర్న్ స్టార్‌తో ట్రంప్‌కు సంబంధాలున్నాయని, దానిని దాచిపెట్టేందుకు ఆయన స్టార్మీకి రూ.1 లక్ష 30 వేల డాలర్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే స్టార్మీకి చెల్లించిన డబ్బును ట్రంప్‌ వ్యాపార ఖర్చుగా ప్రాజెక్ట్ చేస్తూ లెక్కలు చూపించాడు. ఇదే ప్రస్తుతం అతని మెడకు చుట్టుకుంది.

We’re now on WhatsAppClick to Join

2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని స్టార్మీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తనను టీవీ స్టార్‌ని చేస్తానని హామీ ఇచ్చి ట్రంప్ తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని పోర్న్ స్టార్ ఆరోపించింది. అయితే, దీనిని ట్రంప్ ఖండించారు. కాగా కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గతంలో ట్రంప్ అరెస్ట్ ఖాయం అన్న వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ అనంతరం ట్రంప్‌ను అరెస్ట్‌ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Also Read: PM Candidate : ‘ప్రధానిగా ఎవరైతే బెటర్ ?’.. ఒపీనియన్ పోల్‌ ఆసక్తికర విశేషాలు

  Last Updated: 15 Apr 2024, 10:03 AM IST