Donald Trump : ట్రంప్ మావ ఎంత పనిచేసావు – ఇండియన్స్

Donald Trump : వ్యాపార పరంగా సముచితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అమెరికా కూడా అదే తరహాలో ఇండియాపై ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Trump Tariff

Trump Tariff

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇండియా (India) తో తన అనుబంధాన్ని ఎప్పుడూ ప్రత్యేకంగా చూపించుకునే వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైంది. రీసెంట్ గా మోదీ అమెరికా పర్యటనలో కూడా ట్రంప్ మోడీ స్ట్రాంగ్ లీడర్‌గా ప్రశంసించి, ద్వైపాక్షిక సంబంధాలపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ అంతా స్నేహంగా ఉండడమే కాదు, వ్యాపార సంబంధాల్లో అమెరికా ప్రయోజనాలను కాపాడటంలో ట్రంప్ వెనుకాడలేదు. వ్యాపార రంగంలో ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసే నాయకుడు. ఈ క్రమంలోనే ఇండియా అమెరికా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 100%కి పైగా టారిఫ్ విధిస్తోందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపార పరంగా సముచితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అమెరికా కూడా అదే తరహాలో ఇండియాపై ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు. దీని ఫలితంగా ఏప్రిల్ 2 నుంచి అమెరికా కూడా భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించనుందని స్పష్టం చేశారు.

Ropeway: యాత్రికుల‌కు గుడ్ న్యూస్‌.. 9 గంట‌ల ప్ర‌యాణం ఇక‌పై 36 నిమిషాలే!

ఈ నిర్ణయంతో భారత్-అమెరికా వ్యాపార సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ గతంలోనే భారత్‌కు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు ఆయన భారతదేశం లాంటి దేశాల నుంచి మరింత ఆదాయం పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే భారత్ కూడా తన దేశీయ పరిశ్రమలను పరిరక్షించేందుకు ఇలాంటి విధానాలను అవలంబిస్తోంది. ఇకపై ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా మలుపుతిప్పుతాయో చూడాలి. మోదీ-ట్రంప్ స్నేహం ఒకెత్తు, కానీ వ్యాపార పరంగా ఇరు దేశాలూ తమ ప్రయోజనాల కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటాయి. ట్రంప్ విధానాలు అమెరికాకు మేలు చేస్తాయా, లేదా భారత్-అమెరికా వ్యాపార సంబంధాల్లో సమస్యలు తెచ్చిపెడతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.

Harish Rao: చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఇద్ద‌రు ఇద్ద‌రే: హ‌రీశ్ రావు

  Last Updated: 05 Mar 2025, 08:06 PM IST