అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిజంగానే మతిమరుపా.. తన ఆరోగ్యంపై ఏమన్నారంటే..!

Donald Trump  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వ్యక్తులు, అధికారుల పేర్లను ఆయన మరిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడిన విషయం నిజమేనని, అయితే, […]

Published By: HashtagU Telugu Desk
US President Trump Suffering From Alzheimer

US President Trump Suffering From Alzheimer

Donald Trump  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో వ్యక్తులు, అధికారుల పేర్లను ఆయన మరిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడిన విషయం నిజమేనని, అయితే, తనకు ఆ సమస్య లేదని ట్రంప్ చెప్పారు. న్యూయార్క్‌ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల క్రితం ఉన్నట్లే ఇప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తన తండ్రి అల్జీమర్స్ తో బాధపడ్డారని చెబుతున్న క్రమంలో ట్రంప్ ఆ వ్యాధి పేరును మర్చిపోయారు. కొంత ప్రయత్నం తర్వాత గుర్తుచేసుకుని తిరిగి సంభాషణ కొనసాగించారు.

వైట్ హౌస్ స్పందన..
ప్రెసిడెంట్ ట్రంప్ ఇంటర్వ్యూపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా, బలంగా ఉన్నారని ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలిందని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సేనల సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేయడానికి కావాల్సిన  శరీర సామర్థ్యం ఆయనకు ఉందని పేర్కొంది. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మీడియాకు సూచించింది.

  Last Updated: 28 Jan 2026, 03:44 PM IST