Dalai Lama: టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామా తన వారసత్వం , దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై నెలకొన్న అనేక అనుమానాలకు తేల్చిచెప్పారు. 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర పరంపర తన మరణానంతరం కూడా కొనసాగుతుందని ఆయన ధృవీకరించారు. ఈ ప్రకటన బౌద్ధ అనుచరుల మధ్య విశ్వాసాన్ని బలపరిచింది. విదేశాల్లో ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామా, ధర్మశాలలో మత పెద్దల సమావేశం ప్రారంభ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. “దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టంగా చెప్పడానికి ఇపుడు సమయం అనిపించింది,” అంటూ ఆయన చెప్పారు. గత కొంతకాలంగా ఈ వ్యవస్థ భవిష్యత్తుపై వచ్చిన ఊహాగానాలకు ఇది ముగింపు పలికినట్లైంది.
Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
దలైలామా తన అధికారిక ట్విటర్ ఖాతాలో 2011 సెప్టెంబర్ 24న చేసిన ఒక పాత ప్రకటనను పునరుద్ఘాటించారు. అప్పట్లో టిబెటన్ మత పెద్దలతో కలిసి సమావేశమై, తాను టిబెట్ లోపల, వెలుపల ఉన్న తన ప్రజలకు ఈ వ్యవస్థ కొనసాగింపుపై హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దలైలామా పరంపరను కొనసాగించే ప్రక్రియ బౌద్ధ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైనది. శిశువు రూపంలో దలైలామా వారసుడిని గుర్తించే ఈ సంప్రదాయం గత ఆరు శతాబ్దాలుగా కొనసాగుతోంది. దలైలామా తాజా ప్రకటన ఈ సంప్రదాయానికి నూతన ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు, భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్న అనేకమంది బౌద్ధులకు శాంతిని కలిగించింది.
USA : ఉక్రెయిన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత