Site icon HashtagU Telugu

Cretaceous Dinosaur: అతిచిన్న డైనోసార్ల పాదముద్రలు వెలుగులోకి.. ఎక్కడ ?

Cretaceous Dinosaur Footprints

Cretaceous Dinosaur: క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాద ముద్రలు బయటపడ్డాయి. వీటి సైజు ఎంత ఉందో తెలుసా ? కేవలం ఒకటి నుంచి 3 సెంటీమీటర్లలోపే.  ఇప్పటివరకు ప్రపంచంలో గుర్తించిన అతి చిన్న డైనోసార్ పాదముద్రలు ఇవే కావడం గమనార్హం. ఇంతకీ వీటిని ఎక్కడ గుర్తించారని అనుకుంటున్నారా ? చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో ఇవి బయటపడ్డాయి. లింగ్జియాలో ఉన్న డైనోసార్‌ మ్యూజియానికి చెందిన కార్మికులు ఆగస్టు మెుదటి వారంలో వీటిని గుర్తించారు. గాన్సు ప్రావిన్స్‌లో డైనోసార్‌ల పాదముద్రలు బయటపడటం ఇదే తొలిసారి. 1990 సంవత్సరం నుంచి ఇప్పటి రకు చైనాలో 2 వేల వరకు డైనోసార్‌ల(Cretaceous Dinosaur) పాదముద్రలు వెలుగుచూశాయి.

We’re now on WhatsApp. Click to Join

బీజింగ్‌లో ఉన్న చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షింగ్ లిడా మాట్లాడుతూ.. ‘‘ఇంత చిన్న సైజు డైనోసార్ల పాదముద్రలు ఇంతకుముందు చైనాలోని సిచువాన్ బేసిన్‌లో బయటపడ్డాయి. అనంతరం షాడాంగ్ ప్రావిన్స్‌లో అలాంటి వాటిని గుర్తించారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో చిన్న సైజు డైనోసార్ల పాదముద్రల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. వాటన్నింటిని నిశితంగా పరిశీలిస్తే అవన్నీ ఒకే కాలానికి చెందిన డైనోసార్లు అయి ఉండొచ్చని అనిపిస్తోంది’’ అని వివరించారు. చైనా, కొరియా భూభాగాల్లో అప్పట్లో చిన్నసైజు డైనోసార్లు జీవించేవి అనేందుకు ఇవే ఆనవాళ్లు అని వెల్లడించారు. ‘‘డైనోసార్ల నుంచే పక్షులు ఏర్పడ్డాయి అనే వాదనకు ఈ ఆధారాలు బలాన్ని చేకూర్చేలా కనిపిస్తున్నాయి’’ అని షింగ్ లిడా పేర్కొన్నారు.

Also Read :Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్‌లో హైఅలర్ట్

‘‘ఆ చిన్న సైజు డైనోసార్ల పాదముద్రల అచ్చులు అవి నడయాడిన ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి అంత వేగంగా నడిచేవి కాదని దీనితో స్పష్టమైంది. నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో ఆ డైనోసార్లు యాక్టివ్‌గా ఉండేవని తెలుస్తోంది. చిన్న సైజు డైనోసార్లు నడిచిన పరిసరాల్లోనే చాలా బాతులు, నీటిలో నివసించే పలు పక్షుల పాదముద్రలను కూడా గుర్తించాం’’ అని  అసోసియేట్ ప్రొఫెసర్ షింగ్ లిడా తెలిపారు.

Also Read :CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్