China Mosques : చైనాలోని ముస్లింల స్థితిగతులపై హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) సంచలన నివేదికను విడుదల చేసింది. షి జిన్‌పింగ్ ప్రభుత్వం చైనాలోని ఉత్తర ప్రాంతాలైన నింగ్‌జియా, గన్సులలో వందలాది మసీదులను కూల్చేస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. చాలాచోట్ల మసీదుల నిర్మాణ స్వరూపాన్ని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉండేలా మార్చేస్తోందని పేర్కొంది. 2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం మధ్యకాలంలో నింగ్‌జియా, గన్సు ప్రాంతాలలోని చాలా మసీదుల పైనుంచి గోపురాలు, మినార్లను తొలగించారని వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 1,300 మసీదులను చైనా సర్కారు మూసివేయించిందని నివేదికలో వెల్లడించారు. చైనాలో ఉయ్ ఘర్ తెగ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ పరిధిలో నివసిస్తుంటారు. దీని తర్వాత అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ప్రాంతాలైన నింగ్‌జియా, గన్సులలోనూ చైనా మతపరమైన అణచివేతకు పాల్పడుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. మసీదులలో లౌకికమైన ప్రబోధాలు జరిగేలా సెన్సార్(China Mosques) చేస్తోందని తెలిపింది.