China – Moon: చైనా ‘చాంగే-6’ రికార్డ్.. చంద్రుడిపై నుంచి ఏం తెచ్చిందో తెలుసా ?

చైనాకు చెందిన చాంగే-6  వ్యోమనౌక వరల్డ్ హిస్టరీలో తొలిసారిగా చంద్రుడికి అవతలి వైపు ఉన్న మట్టి, శిథిలాలను సేకరించి ఇవాళ భూమి మీదకు తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - June 25, 2024 / 03:42 PM IST

China – Moon: చైనా మరో రికార్డును సొంతం చేసుకుంది.  చైనాకు చెందిన చాంగే-6  వ్యోమనౌక వరల్డ్ హిస్టరీలో తొలిసారిగా చంద్రుడికి అవతలి వైపు ఉన్న మట్టి, శిథిలాలను సేకరించి ఇవాళ భూమి మీదకు తీసుకొచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ ప్రాంతంలో చాంగే-6  ల్యాండర్ సురక్షితంగా భూమిపైకి దిగింది. చాంగే-6 తీసుకొచ్చిన శాంపిల్స్‌లో 2.5 మిలియన్‌ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ శాంపిల్స్‌ను స్టడీ చేస్తే చంద్రుడికి(China – Moon) రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

  • మే 3న చాంగే-6  ప్రయోగం జరిగింది. ఆ వ్యోమనౌక దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి చంద్రుడిని చేరింది. జూన్‌ 2న చంద్రుడికి అవతలి వైపున ఉన్న సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలోని అపోలో బేసిన్‌లో చాంగే-6 దిగింది.
  • చాంగే-6 వ్యోమనౌకలో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి.
  • చంద్రుడి ఉపరితలంపై ఉన్న శాంపిల్స్‌ను రోబోటిక్‌ హ్యాండ్ సాయంతో సేకరించారు. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి మట్టిని తీసుకుంది.
  • చంద్రుడికి సంబంధించిన ఒక భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. మనకు కనిపించని చంద్రుడి భాగాన్ని ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు.
  • అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ మాత్రమే చంద్రుడి అవతలి వైపునకు వ్యోమనౌకలు పంపగలిగాయి. ఇప్పుడు ఆ లిస్టులో చైనా కూడా చేరింది.
  • చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తి భిన్నంగా ఉంటాయని రిమోట్‌ సెన్సింగ్‌ నివేదికలతో తెలుస్తోంది.
  • చంద్రుడి అవతలి భాగం బిలాలతో నిండిపోయి ఉంటుందట.  అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఆ బిలాలు చంద్రుడి ఉపరితలంపై ఏర్పడ్డాయని అంటారు.

Also Read :Dasari Gopikrishna : అమెరికాలో బాపట్ల యువకుడి మర్డర్.. హంతకుడి అరెస్ట్, వివరాలివీ