Chinese Billionaires: సింగపూర్‌ కు ఎగిరిపోతున్న చైనా బిలియనీర్లు.. కారణమిదే..?

చైనాకు చెందిన పలువురు బిలియనీర్లు (Chinese Billionaires) ఇటీవలి కాలంలో సింగపూర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ భయంతో అక్కడి బిలియనీర్లు చైనాను వదిలి సురక్షిత దేశానికి తరలివెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పన్ను చెల్లించని చాలా మంది బిలియనీర్లు, సెలబ్రిటీలపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నా విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 08:18 AM IST

చైనాకు చెందిన పలువురు బిలియనీర్లు (Chinese Billionaires) ఇటీవలి కాలంలో సింగపూర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ భయంతో అక్కడి బిలియనీర్లు చైనాను వదిలి సురక్షిత దేశానికి తరలివెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పన్ను చెల్లించని చాలా మంది బిలియనీర్లు, సెలబ్రిటీలపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నా విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో చైనాకు చెందిన చాలా మంది బిలియనీర్లు తమ సంపదను కాపాడుకోవడానికి చైనాను విడిచిపెట్టి ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది బిలియనీర్లు సింగపూర్ చేరుకున్నారు. ఇది కాకుండా చైనా జీరో కోవిడ్ విధానం తర్వాత కూడా చాలా మంది బిలియనీర్లు ఇతర దేశాలను తమ నివాసంగా మార్చుకుంటున్నారు.

సింగపూర్.. చైనా బిలియనీర్ల మొదటి ఎంపికగా మారడానికి కారణం.. గత అరవై సంవత్సరాలుగా ఒక పార్టీ పాలించడం, కార్మిక సమ్మెలు, వీధి నిరసనలపై పూర్తి నిషేధం ఉంది. పన్నులు కూడా తులనాత్మకంగా తక్కువగా ఉన్నాయి. సింగపూర్ జనాభాలో ఎక్కువ మంది చైనా మూలానికి చెందినవారు ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవలి కాలంలో చాలా మంది చైనీస్ బిలియనీర్లు సింగపూర్‌లో విలాసవంతమైన గృహాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా సెంటోసా ద్వీపంలో గణనీయమైన సంఖ్యలో చైనా పౌరులు స్థిరపడ్డారు. ఇది థీమ్ పార్కులు, కాసినోలతో పాటు విలాసవంతమైన గోల్ఫ్ కోర్సును కలిగి ఉంది. సింగపూర్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్, రీలోకేషన్ సంస్థ AIMS CEO కూడా చైనా బిలియనీర్లు సింగపూర్‌కు తరలిపోతున్నట్లు అంగీకరించారు. సెంటోసా గోల్ఫ్ కోర్స్‌లో రోల్స్ రాయల్స్, బెంట్లీస్ వంటి లగ్జరీ కార్లు కనిపించడం ఇప్పుడు సర్వసాధారణం. సింగపూర్‌లో స్థిరపడిన చైనా పౌరుల్లో ఎక్కువ మంది యువకులే.

Also Read: Gold And Silver Price Today: ఈరోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభ‌వార్త..!

తాజాగా పలువురు బిలియనీర్లపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ చర్యలు తీసుకోవడం గమనార్హం.అందులో అగ్రశ్రేణి వ్యాపారవేత్త జాక్ మా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చైనా ప్రభుత్వ చర్య కారణంగా జాక్ మాకు 25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అనేక మంది ఇతర చైనా బిలియనీర్లు కూడా చైనా ప్రభుత్వ చర్యకు భయపడుతున్నారు. చైనా బిలియనీర్లు ఇప్పుడు తమ సంపదను కాపాడుకోవడానికి ఇతర దేశాల వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం. చైనా అతిపెద్ద హాట్‌పాట్ చైన్ హైదిలావో వ్యవస్థాపకుడు ఇటీవల సింగపూర్‌లో కుటుంబ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. గత సంవత్సరం చివరి నాటికి 1500 మంది చైనీస్ వ్యాపారవేత్తలు సింగపూర్‌లో కుటుంబ వ్యాపారాలను ప్రారంభించారు.