China Vs US : ‘‘పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాం’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు ధీటుగా అన్ని రంగాల్లో ఎదుగుతున్న చైనా ఈ ప్రకటనపై గుర్రుమంటోంది. గాజా ప్రాంతం ముమ్మాటికీ పాలస్తీనియులదే అని, దానిపై అమెరికా పెత్తనాన్ని తాము అంగీకరించమని చైనా స్పష్టం చేసింది. గాజా ప్రాంతం నుంచి పాలస్తీనా ప్రజలను తరలించే ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ ప్రకటన ద్వారా ప్రపంచ ముఖచిత్రంలో మరోసారి చైనా తన ప్రాభవాన్ని చాటుకుంది. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, తమ స్పందన న్యాయం వైపే ఉంటుందని నిరూపించుకుంది. అరబ్ దేశాలతో కూడిన అరబ్ లీగ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాజా ప్రాంతం నుంచి 20 లక్షల మంది పాలస్తీనీయులను జోర్డాన్, ఈజిప్టు దేశాలకు తరలించడం అనేది సరికాదని అరబ్ లీగ్ పేర్కొంది.
Also Read :Personal Finance Changes: మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే.. కేంద్ర బడ్జెట్‌లోని పన్ను మార్పులివే
అరబ్ దేశాల్లో చైనా పాగా
గత కొన్నేళ్లలో అరబ్ దేశాల్లో చైనా ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. ఆయా దేశాలతో స్నేహ సంబంధాలను చైనా బలోపేతం చేసుకుంది. సౌదీ లాంటి కీలకమైన దేశాలు నేరుగా చైనా కరెన్సీని స్వీకరించి, ముడి చమురును విక్రయిస్తున్నాయి. ఆయా దేశాలకు ముఖ్యమైన ఆయుధ సంపత్తిని కూడా చైనా విక్రయిస్తోంది. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా ఉన్న ఇరాన్‌కు కూడా ఆయుధ సంపత్తిని డెవలప్ చేసే విషయంలో చైనా సహాయ సహకారాలను అందిస్తోంది అయితే నేరుగా ఈ సాయాన్ని చేయడంలేదు.
Also Read :ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవే.. మొదటి స్థానానికి చేరువగా టీమిండియా ఓపెనర్!
ఉత్తర కొరియా రూట్‌లో..
క్షిపణి కార్యక్రమం, అణ్వాయుధ తయారీకి సంబంధించిన టెక్నాలజీని తొలుత ఉత్తర కొరియాకు, అక్కడి నుంచి ఇరాన్‌కు సముద్ర మార్గంలో చేరవేస్తోంది. యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లకు కూడా చైనా ఆయుధాలు అందుతున్నాయి. పాలస్తీనా స్వతంత్య్ర రాజ్య భావనకు మొదటి నుంచే చైనా స్పష్టమైన మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్‌కు ఏకపక్షంగా అమెరికా(China Vs US) సాయం చేయడాన్ని డ్రాగన్ వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో అరబ్ దేశాల్లోని తన ప్రయోజనాల పరిరక్షణ కోసం చైనా ఎంతకైనా తెగించే అవకాశాలు లేకపోలేదు.