China – Nuclear Tests : మరోసారి అణుబాంబులతో చైనా టెస్ట్ ?

China - Nuclear Tests : చైనా మరోసారి అణు పరీక్షలకు రెడీ అవుతోంది.

  • Written By:
  • Updated On - December 23, 2023 / 07:31 AM IST

China – Nuclear Tests : చైనా మరోసారి అణు పరీక్షలకు రెడీ అవుతోంది. మారుమూల జిన్‌జియాన్‌ అటానమస్‌ ఏరియాలోని  లోప్‌నూర్‌ ప్రాంతంలో ఇందుకు చకచకా సన్నాహాలు చేస్తోంది. ఈక్రమంలోనే అక్కడ కొండల్ని తొలిచి సొరంగాలను నిర్మించారు. అక్కడే ఒక కొత్త వైమానిక స్థావరం కూడా నిర్మాణ దశలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్నపాటి శాటిలైట్‌ టౌన్‌ ఏర్పాటైంది. అణ్వాయుధాలను భద్రంగా దాచేందుకు పటిష్టమైన బంకర్‌.. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు ఉన్నాయి. ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్‌ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్‌ పైపులను వేశారు. వీటి సాయంతో నేలలోకి నిలువుగా కనీసం పావు మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారట.

We’re now on WhatsApp. Click to Join.

ఇవన్నీ ఒట్టి మాటలు కాదు.. శాటిలైట్ ఇమేజెస్‌లో ఉన్నసీన్‌లకు వ్యాఖ్యానాలు. అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్‌ రెనీ బాబియార్జ్‌ తమకు వీటిని అందించారంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. చైనాలోని మలాన్‌ అనే మరో ప్రాంతంలోనూ అత్యాధునిక శాటిలైట్‌ సిటీని నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజెస్‌లో ఉంది. అక్కడ కూడా రిగ్గింగ్‌ యంత్రాల సెటప్‌ కనిపిస్తోంది.

Also Read: New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ ..!

లోప్‌నూర్‌ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి మలాన్ ప్రాంతంలో ముందస్తు శిక్షణ ఇస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 2028 కల్లా చైనా వద్ద 1,000కిపైగా ఖండాంతర క్షిపణులు ఉంటాయి.  వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా తీర్చిదిద్దాలని చైనా భావిస్తోంది.ఇందుకు అవసరమైన అత్యాధునిక అణు వార్‌హెడ్లను తయారు చేయడమే ఈసారి అణుపరీక్షల లక్ష్యమని అంచనా వేస్తున్నారు. వచ్చే నెలరోజుల్లోగా ఏ క్షణంలోనైనా ఈ అణు పరీక్షలు జరగొచ్చని అంచనా వేసింది. తొలిసారిగా 1964లో ఇదే  లోప్‌నూర్‌ ప్రాంతంలో చైనా తొలిసారిగా అణు పరీక్షలు(China – Nuclear Tests) జరిపిందని గుర్తు చేసింది.