Houthis Hijack : టర్కీ – ఇండియా కార్గో షిప్‌‌ను హైజాక్ చేసిన హౌతీలు

Houthis Hijack : యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు.. టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన ‘గెలాక్సీ లీడర్‌’ కార్గో నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 07:14 AM IST

Houthis Hijack : యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు.. టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన ‘గెలాక్సీ లీడర్‌’ కార్గో నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు. ఈ నౌకలో ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిపినో, మెక్సికన్ సహా పలు దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. ఈ షిప్‌ను యెమన్ తీరంలోని ఓడరేవు నగరం సలీఫ్‌కు హౌతీ మిలిటెంట్లు తీసుకెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నౌకలో భారతీయులు, ఇజ్రాయెలీలు ఎవరూ లేరని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యెమెన్ దేశ సమీపంలోని ఎర్ర సముద్రం దక్షిణ భాగంలో హౌతీలు ఈ కార్గో షిప్‌ను హైజాక్ చేశారని తెలిపింది. ఇరాన్ చేసిన సూచనల మేరకే ఈ నౌకను యెమెన్ హౌతీలు హైజాక్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నౌక ఒక బ్రిటీష్ కంపెనీకి చెందినదని.. ఇజ్రాయెల్ వ్యాపార దిగ్గజం అబ్రహం ఉంగార్‌ ఆ కంపెనీలో పార్ట్‌నర్‌గా ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నౌకను జపాన్‌కు చెందిన ఒక కంపెనీ లీజుకు తీసుకొని నడుపుతోందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. గాజాలోని సామాన్య పౌరులపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు ఆపేవరకు ఎర్ర సముద్రంలో రాకపోకలు సాగించే ఇజ్రాయెలీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇటీవల హౌతీలు ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నౌకను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

Also Read: 60 Boats Burnt : విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. 60 బోట్లు దగ్ధం!