Site icon HashtagU Telugu

Canada Cigarettes: ధూమపాన ప్రియుల కోసం హెచ్చరిక లేబుల్… ఎక్కడో తెలుసా?

Canada Cigarettes

New Web Story Copy 2023 06 01t172150.858

Canada Cigarettes: ధూమపాన ప్రియుల కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సిగరెట్ నుంచి తమ పౌరులను కాపాడేందుకు ఆ దేశం ముందడుగేసింది. అందులో భాగంగా ప్రతి సిగరెట్ పై హెచ్చరిక లేబుల్ ముద్రించేందుకు కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో పొగాకు మరణాలను తగ్గించేందుకు కెనడా సిగరెట్లపై ప్రత్యక్ష ఆరోగ్య హెచ్చరిక లేబుల్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు కెనడియన్ మీడియా నివేదికలో పేర్కొంది.

ధూమపానం చేయడం ద్వారా చుట్టుప్రక్కల వారికి కూడా ప్రమాదమే. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్ వల్ల లుకేమియా ఎటాక్ చేస్తుంది. దీంతో శరీరం అనారోగ్య పాలవడమే కాకుండా మరణ అంచుకు చేరుస్తుంది. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ప్రతి సిగరెట్‌పై ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో త్వరలో కొన్ని సందేశాలు కనిపిస్తాయి. కాగా సిగరెట్ పై ప్రమాద హెచ్చరికలు ముద్రించడం ద్వారా ప్రపంచంలోనే మొదటి దేశంగా కెనడా నిలిచింది.

ప్రతి సిగరెట్‌పై ముద్రించిన హెచ్చరికలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయని, దీంతో మార్పు వచ్చే అవకాశం ఉందంటూ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కెనడియన్ క్యాన్సర్ సొసైటీలోని సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ .. ధూమపానం చేసే ప్రతి ఒక్కరినీ చేరుకునే విధంగా ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్పారు. 2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని ఐదు శాతం కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కెనడా అధికార బృందం తెలిపింది.

Read More: Chicken: చికెన్ తినేవారికి అలర్ట్.. అతిపెద్ద వ్యాధికి కారణమవుతున్న కోడి మాంసం..!